Telugu News » బీఆర్ఎస్ దెబ్బతో ప్రజాభవన్‌కు..!

బీఆర్ఎస్ దెబ్బతో ప్రజాభవన్‌కు..!

తాము గత అసెంబ్లీలోఈ అంశాన్ని ఆధారాలతో సహా నిరపూపించామని చెప్పారు.

by Ramu
Harish rao said that cm revanth reddy went to praja bhavan only under the pressure of brs

మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా భవన్‌కు రోజూ వెళ్తానని గతంలో రేవంత్ (Revanth reddy) చెప్పారని.. కానీ కేవలం మొదటిరోజే వెళ్లానన్నారు. తాము గత అసెంబ్లీలోఈ అంశాన్ని ఆధారాలతో సహా నిరపూపించామని చెప్పారు.

Harish rao said that cm revanth reddy went to praja bhavan only under the pressure of brs

 

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ దెబ్బకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ దెబ్బకు రేవంత్ ప్రజాభవన్ కు పరుగెత్తారని అన్నారు. ఈరోజు కేవలం అరగంట ముందే సమాచారం ఇచ్చి హడావుడిగా ప్రజాభవన్ కు వెళ్లారని చెప్పారు. ప్రజాభవన్‌కు సీఎం వస్తారని నిన్న సమాచారం ఇస్తే.. ఈరోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లారని పేర్కొన్నారు.

రిజర్వాయర్లను తాము నింపాం కాబట్టి యాసంగికి నీటి సమస్య లేదని అన్నారు. కానీ వచ్చే యాసంగికి నీరు వస్తుందని భావించడం లేదన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి తెలంగాణ రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగారు. నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా ఆ చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. చేయలేకపోతే రేవంత్ రాజీనామా చేస్తానన్నారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి చూపిస్తానని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిపంట పండితే, తమ హయాంలో మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి పండిందన్నారు.

You may also like

Leave a Comment