Telugu News » Harish Rao : కాంగ్రెస్ గ్యారంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్స్: హరీష్ రావు

Harish Rao : కాంగ్రెస్ గ్యారంటీలు సంతకం లేని పోస్ట్ డేటెడ్ చెక్స్: హరీష్ రావు

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో పింఛన్‌ రూ. 600 మాత్రమేనని, వికలాంగులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రైతుబంధు కర్ణాటకలో అమలు చేయట్లేదని చెప్పారు.

by Prasanna
Harish rao

కాంగ్రెస్‌ గ్యారెంటీలు (Congress Promises) సంతకం లేని పోస్ట్ డేటెడ్‌ చెక్‌ (Post Dated Cheques) లాంటివన్నారు మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలేమో కానీ.. ఆరు నెలలకో సీఎం మారడం ఖాయమన్నారు. ఆరు నెలలకు ఒక కర్ఫ్యూ విధిస్తారని.. ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇస్తారంటూ కాంగ్రెస్‌పై సెటైర్లు వేశారు. నారాయణ్‌ ఖేడ్‌ నియోజకవర్గం శంకరంపేట్‌లో పర్యటించిన హరీష్‌ రావు లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను అందించారు.

Harish rao

కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో పింఛన్‌ రూ. 600 మాత్రమేనని, వికలాంగులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. రైతుబంధు కర్ణాటకలో అమలు చేయట్లేదని చెప్పారు. కాంగ్రెస్‌ వాళ్లు పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కర్ణాటకలో ఇచ్చిన హామీల‌ను అమలు చేశాక ఇక్కడ మాట్లాడాలన్నారు.

అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్‌ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్‌ అవుతుందన్న హరీష్‌ రావు.. వారానికి రెండు పవర్‌ హాలి డేలు ఉంటాయన్నారు. తెలంగాణ రెండో రాజధానిగా బెంగళూరును చేస్తారని, ఢిల్లీకి వెళ్లాలంటే వయా బెంగళూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుందన్నారు.

త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని, ఎన్నిక‌ల ప్ర‌ణాళిక అద్భుతంగా ఉండబోతుందని చెప్పారు. త్వరలోనే శంకరంపేట పొలాలకు కాళేశ్వరం నీళ్లందిస్తామన్నారు. నారాయణ్ ఖేడ్ లోని 350 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

You may also like

Leave a Comment