Telugu News » Love jump : ప్రియురాలికి పిజ్జా తీసుకెళ్లాడు…ఇంతలో ఆమె తండ్రి వచ్చాడు..తర్వాత.!?

Love jump : ప్రియురాలికి పిజ్జా తీసుకెళ్లాడు…ఇంతలో ఆమె తండ్రి వచ్చాడు..తర్వాత.!?

by sai krishna

ఓ ప్రియురాలు పిజ్జా(Pizza) అడిగింది. ఆమె కోరినట్టుగానే ఆ రెక్కలు కట్టుకుని పిజ్జాతో వాలిపోయాడా ప్రేమికుడు. నిజానికి పిజ్జా వారు కలిసి కబుర్లు చెప్పుకోడానికి పిజ్జా అనేది ఓ కారణం మాత్రమే.!

ఓ వైపు తెచ్చిన పిజ్జా చల్లారిపోతుంది. మరో వైపు సమయం ఐస్ క్రీములా కరిగిపోతుంది.ఇంతలో అనుకోకుండా ఆ అమ్మాయి తండ్రి వచ్చాడు. దీంతో ఆ యువకుడికి ఏం చెయ్యాలో తోచలేదు.

ఆ అమ్మాయి అయితే తలవాల్చకుని వాళ్ల నాన్నపక్క నుంచే సైలెంట్ గా లోపలికి వెళ్లిపోతుంది. పాపం ..! పిజ్జా ఇవ్వడం కోసం నాలుగో అంతస్తుదాకా వచ్చిన ఈ ప్రేమికుడు ఎలా వెళ్లాలి.?!

అమ్మాయి నాన్న రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోయాడు. కళ్లుముసుకుని వెనక్కి తిరిగాడు. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..!క్షణాల నిశ్శబ్ధం మరో క్షణంలో శబ్ధంగా మారిపోయింది.

హైదరాబాద్‎(Hyderabad)లోని బోరబండ(Borabanda)లో ఈ విషాదకర ఘటన జరిగింది. యువకుడి మరణంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

19 ఏళ్ల మహమ్మద్ షోయబ్ బోరబండలో ఉంటున్నాడు. అక్కడే ఓ బేకరీ(Bakery)లో ఉద్యోగం చేస్తున్నాడు..గత కొంత కాలంగా అదే ప్రాంతానికి చెందిన యువతితో షోయబ్‎కు పరిచయం ఏర్పడింది.

వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తరచుగా మాట్లాడటం, కలవటం చేస్తుండేవారు. ఆమె కోరిందని ఆదివారం రాత్రి పిజ్జా తీసుకొని ఆమె ఇంటికి వెళ్లాడు షోయబ్ . అదే టైంలో యువతి తండ్రి బయటికి రావడంతో కంగారు పడిపోయిన షోయబ్‌, తప్పించుకోవాలనే ఉద్దేశంతో నాలుగో అంతస్తు నుంచి దూకాడు.

తీవ్రంగా గాయపడిన షోయబ్‎ను స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వచ్చారు. షోయబ్ ను గవర్నమెంటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షోయాబ్‌ సోమవారం చనిపోయాడు.పోలీసులు ఈ విషయాన్ని తెలిపారు. షోయబ్ తండ్రి ఫిర్యాదు మేరకు మిస్టీరియస్ డెత్‎గా పోలీసులు కేసు ఫైల్ చేశారు.

You may also like

Leave a Comment