చిన్న నిప్పు రవ్వతో అడవి తగులబడినట్టుగా జింబాబ్వే(Zimbabwe)మాజీ క్రికెటర్ చనిపోయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో పాపం! సీనియర్ క్రికెటర్ హీత్ స్ట్రీక్(Heath streak)వచ్చి తాను చనిపోలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
మరి ఈ పుకారు ఎలా వచ్చిందంటే ..తోటి క్రికెటర్ హెన్రీ ఓలాంగో(Henry Olango)హీత్ స్ట్రీక్ చనిపోయినట్లు ఓ ట్వీట్ చేశారు. అంతే..! ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోయింది.
దీంతో తాను మరణించినట్లు వచ్చిన వార్త తనను బాధించినట్లు స్ట్రీక్ వెల్లడించాడు. స్ట్రీక్ స్వయంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడారు, తాను ప్రాణాలతోనే ఉన్నట్లు ఆ సంస్థతో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తన చావుపై వచ్చిన వార్త రూమర్ అని, అది శుద్ధ అబద్ధం అన్నారు. ఎటువంటి నిర్ధారణ లేకుండా ఎలా ఒకరి చావు వార్తను వ్యాప్తి చేస్తారని హీత్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన చావు వార్తను వ్యాప్తి చేసిన వ్యక్తి క్షమాపణ చెప్పాలన్నారు.
ఆ వార్త తనను ఎంతో బాధించినట్లు స్ట్రీక్ వెల్లడించారు. హీత్ స్ట్రీక్ మరణవార్తను పోస్టు చేసిన ఓలాంగో..మళ్లీ కొత్త ట్వీట్ చేశారు. థర్డ్ అంపైర్(Third umpire)అతన్ని వెనక్కి రమ్మన్నట్లు తెలిసిందని కామెంట్ చేశారు.