ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఒక ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది.
విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ శనివారం తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి.
శనివారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 5.5 సెం.మీ., నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెళ్లి 5.4 సెం.మీ., నారాయణపేట జిల్లా ధన్వాడ 4.8 సెం.మీ., నిర్మల్ జిల్లా భైంస మండలం వనాల్పహాడ్లో 4.3 సెం.మీ. వర్షం కురిసింది.
రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి