Telugu News » HERO NITHIN : హీరో నితిన్ బర్త్ డే స్పెషల్..‘తమ్ముడు’మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!

HERO NITHIN : హీరో నితిన్ బర్త్ డే స్పెషల్..‘తమ్ముడు’మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో(TOLLYWOOD) హీరో నితిన్(ACTOR NITHIN) తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి సినిమా ‘జయం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నితిన్.. తొలిమూవీతోనే బ్లాక్ బ్లాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి సినిమాలో నితిన్ వేషం, భాష చూసి చాలా మంది ఇతను హీరోనా అని అవహేళన చేసినట్లు తెలిసింది.

by Sai
Hero Nitin's birthday special..'Thammudu' movie first look release!

ఆ తర్వాత కాలక్రమేణా నితిన్ తనలోని యాక్టింగ్ టాలెంట్‌తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా ఎంతో ఇంప్రూవ్ చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇండస్ట్రీలో ఎంతో మంది కుర్రహీరోలు(YOUNG HEROS) ఉన్నారు.అందులో నితిన్ తన కంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగాడు.

నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూటర్. వీరి స్వస్థలం నిజామాబాద్. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు(DIL RAJU)తో నితిన్ ఫ్యామిలీకి మంచి పరిచయం ఉంది.రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో ‘దిల్’ సినిమా రాగా.. అదిసూపర్ హిట్ అయ్యింది. దీంతో అప్పటి నుంచి నిర్మాత రాజును ‘దిల్ రాజు’గా పిలవడం మొదలైంది.

అయితే, తన కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్స్ ఎక్కువగా ఉన్నా పట్టుదలతో శ్రమిస్తూ మంచి తన కెరీర్‌ను గాఢీన పెట్టుకున్నాడు నితిన్. నేడు నితిన్ బర్త్ డే. 30 మార్చి 1983లో జన్మించిన ఈ ఇష్క్ హీరో నేడు 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. దీంతో నితిన్ కు అటు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ సందర్భంగా నితిన్ అప్ కమింగ్ మూవీ ‘తమ్ముడు’ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ మూవీకి నిర్మాతలుగా దిల్ రాజు, శిరీష్ వ్యహరిస్తుండగా.. శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నారు.

You may also like

Leave a Comment