Telugu News » Visaka Industries : ఆరువారాల్లో రూ. 17.5 కోట్లు కట్టండి: హైకోర్టు

Visaka Industries : ఆరువారాల్లో రూ. 17.5 కోట్లు కట్టండి: హైకోర్టు

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విశాఖ ఇండస్ట్రీస్‌కు 18 శాతం వడ్డీతో రూ. 25 కోట్లు చెల్లించాలని 2016లోనే హెచ్‌సీఏని కోర్టు ఆదేశించింది.

by Prasanna
visaka

విశాఖ ఇండస్ట్రీస్‌కు (Visaka Industries) ఆరు వారాల్లోపు రూ.17.5 కోట్లు చెల్లించాలని హెచ్‌సీఏని (HCA) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) ఆదేశించింది. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి విశాఖ ఇండస్ట్రీస్ బ్యాంక్‌లో లోన్ తెచ్చి స్పాన్సర్ షిప్ చేసింది. ఆ తరువాత హెచ్‌సీఏ – విశాఖ ఇండస్ట్రీస్ మధ్య స్పాన్సర్ షిప్ అగ్రిమెంట్‌న‌ు హెచ్‌సీఏ క్యాన్సల్ చేసింది. దీనిపై విశాఖ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లింది.

visaka అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు విశాఖ ఇండస్ట్రీస్‌కు 18 శాతం వడ్డీతో రూ. 25 కోట్లు చెల్లించాలని 2016లోనే హెచ్‌సీఏని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను పాటించకపోవడంతో  హెచ్‌సీఏ బ్యాంక్ అకౌంట్స్‌ను 2022 అక్టోబర్‌లో కమర్షియల్ కోర్టు అటాచ్ చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ అకౌంట్స్ డీ ఫ్రీజ్ చేయాలని హైకోర్టులో హెచ్‌సీఏ అప్పీల్ చేసింది. దీనిపై ఆరు వారాల్లోగా రూ.17.5 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్‌కు చెల్లించాలని కోర్టు హెచ్‌సీఏని ఆదేశించింది.

దీనిపై స్పందించిన విశాఖ ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి దీనిని హెచ్‌సీఏ త్వరగా సెటిల్ చేసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. అలాగే 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణం కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని హెచ్‌సీఏకు విశాఖ ఇండస్ట్రీస్ స్పాన్సర్ షిప్ చేసిందని చెప్పారు. స్పాన్సర్ షిప్ చేసినందుకు తమకు కు కొన్ని రైట్స్ ఇచ్చేలా అగ్రిమెంట్ కూడా చేసుకున్నామన్నారు. అయితే కొన్నిరోజుల తర్వాత హెచ్‌సీఏ అగ్రిమెంట్‌ను క్యాన్సల్ చేసిందన్నారు. దీంతో చట్టప్రకారం కోర్టుకు వెళ్ళినట్లు తెలిపారు.

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినందుకు చట్టప్రకారం వడ్డీతో పాటు రూ. 25 కోట్లు చెల్లించాలని 2016లో హెచ్‌సీఏ‌ని కోర్ట్ ఆదేశించిందని చెప్పారు. దీనిపై హెచ్‌సీఏ కమర్షియల్ కోర్టు‌కు అప్పీల్ కి వెళ్లినా.. ఎక్కడా స్టే ఇవ్వలేదని తెలిపారు. 2022 అక్టోబర్‌లో హెచ్‌సీఏ ఆస్తులన్నీ అటాచ్ చేస్తూ, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తూ కమర్షియల్ కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పారు. కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు ఇతర మ్యాచ్‌లు నిర్వహించారన్నారు. తాజాగా బ్యాంక్ అకౌంట్ డీ ఫ్రీజ్ చేయాలని హెచ్‌సీఏ హైకోర్టుకు వెళ్ళిందన్నారు. దీంతో 6 వారాల్లోగా రూ.17.5 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్  అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

You may also like

Leave a Comment