Telugu News » Howrah Express: హౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు, బెంబేలెత్తిపోయిన ప్రయాణీకులు

Howrah Express: హౌరా ఎక్స్ ప్రెస్ లో పొగలు, బెంబేలెత్తిపోయిన ప్రయాణీకులు

ఒక్కసారిగా రైలులో పొగలు రావడం కనిపించింది. దీనిని గమనించిన ప్రయాణీకులు కలవర పాటుకు గురైయ్యారు. క్రమక్రమంగా పొగ రైలు బోగిలలో నిండిపోయింది.

by Prasanna
Howrah express

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా హౌరా (Howrah) వెళుతున్న హౌరా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు వచ్చాయి. దీంతో బెంబేలెతత్తిపోయిన ప్రయాణీకులు (Passengers) ఆర్తనాదాలు చేశారు. కొందరు ప్రయాణీకులు చైన్ లాగడంతో…రైలు (Train) ఆగింది.

Howrah express

రైలు ఆగిన వెంటనే ప్రయాణీకులు రైలు దిగి…దూరంగా పరుగులు పెట్టారు. ఈ సంఘటన ఇవాళ (సోమవారం) వరంగల్ జిల్లా నెక్కొండ సమీపంలో జరిగింది. 2023, సెప్టెంబర్ 11వ తేదీ ఉదయం 12 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లా నెక్కొండ

సాఫీగా సాగుతున్న రైలు ప్రయాణంలో ప్రయాణీకులందరూ హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా రైలులో పొగలు రావడం కనిపించింది. దీనిని గమనించిన ప్రయాణీకులు కలవర పాటుకు గురైయ్యారు. క్రమక్రమంగా పొగ రైలు బోగిలలో నిండిపోయింది. చైన్ లాగడంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును వెంటనే రైలును నిలిపి వేశారు.

రైలు నిలిచిన వెంటనే రైలు సిబ్బంది, అప్పటికే సమాచారం అందుకున్న కొందరు రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదాలకు కారణాలపై పరిశీలించారు. అనంతరం రైలు బ్రేక్ లైనర్లు పట్టేయడంతో పొగలు వచ్చాయని, ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు.

ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రయాణీకులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. రైలు ప్రయాణం అంటేనే…ఏ నిమిషం ఏం జరుగుతుందో… సేఫ్ గా గమ్యస్థానం చేరుతామో లేదో… అన్న భయం వెంటాడుతోంది. జూన్ మొదటివారంలో జరిగిన ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదం తర్వాత ఏ చిన్న రైలు ప్రమాదమైనా ప్రజలను ఉలిక్కి పడేలా చేస్తోంది.

You may also like

Leave a Comment