Telugu News » Railway : పండుగ పూట రైల్వే శాఖ నిర్లక్ష్యం… మండిపడుతున్న ప్రయాణికులు….!

Railway : పండుగ పూట రైల్వే శాఖ నిర్లక్ష్యం… మండిపడుతున్న ప్రయాణికులు….!

పండుగ నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లను చేయడంలో భారతీయ రైల్వే విఫలం అయిందంటు సామాన్య ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

by Ramu
Huge Rush At Railway Stations Stampede Like Situation

దేశ వ్యాప్తంగా దీపావళి (Deepavali) వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పండుగ నేపథ్యంలో బస్టాండులు(Bus Stand), రైల్వే స్టేషన్లు చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే పండుగ నేపథ్యంలో పెరిగిన రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లను చేయడంలో భారతీయ రైల్వే విఫలం అయిందంటు సామాన్య ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎక్కడ చూసినా రద్దీగా ఉన్న రైళ్లు, టికెట్ కౌంటర్ల వద్ద భారీగా క్యూ లైన్లు, ప్లాట్ ఫారమ్ లపై ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా తమ బాధలను పంచుకుంటున్నారు. తాను రిజర్వేషన్ చేసుకున్నానని, టికెట్ కూడా కన్ఫార్మ్ అయిందని గుజరాత్ కు చెందిన ప్రయాణికుడు ఒకరు తెలిపారు. రైలులో జనం కిక్కిరిసి ఉన్నారని, కనీసం రైలులోకి ఎక్కేందుకు కూడా తనకు అవకాశం దొరకలేదన్నారు. దీంతో వడోదర రైల్వే స్టేషన్ లో రైలు మిస్ అయ్యానన్నాడు.

భారతీయ రైల్వే పనితీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. తన దీపావళి వేడుకలన నాశనం చేసినందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. తనకు థర్డ్ ఏసీ కన్ఫార్మ్ టికెట్ ఉన్నప్పటికీ తనకు ఇలాంటి అనుభవం ఎదురైందన్నారు. కనీసం రైల్వే పోలీసులు కూడా తనకు సహాయం చేయలేదన్నారు. తనతో పాటు చాలా మంది రైలు ఎక్కలేకపోయారన్నారు.

రైలులో చాలా మంది డోర్ల వద్ద నిల్చుని ఉన్నారని, రైలులో ఎక్కేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదన్నారు. వాళ్లు ముందే రైలు డోర్లను క్లోజ్ చేసుకున్నారని, ఎంత పిలిచినా ఓపెన్ చేయలేదన్నారు. పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరించారని తెలిపారు. దీనిపై వడోదర డివిజన్ రైల్వే మేనేజర్ స్పందించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

మరోవైపు సూరత్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. బిహార్ కు వెళ్లే ప్రత్యేక రైలులో ఎక్కేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా వచ్చారు. దీంత్ో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పలువురికి స్పృహ తప్పినట్టు తెలిపారు. మరోవైపు పండుగ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 1700 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. అదనంగా 26 లక్షల బెర్తులను ఏర్పాటు చేశామని రైల్వే శాఖ వెల్లడించింది.

 

 

You may also like

Leave a Comment