Telugu News » Huzurabad : 14 వేల కుటుంబాలకు దళితబంధు అందలేదు

Huzurabad : 14 వేల కుటుంబాలకు దళితబంధు అందలేదు

రెండు లక్షల కోట్లతో రాష్ట్రమంతా దళితబంధు ఇస్తానని చెప్పిన కేసీఆర్ (KCR), ఆ పని చేసి దళితులను ఆదుకోవాలని ఈటెల డిమాండ్ చేశారు.

by Prasanna
Etela Rajender

హుజురాబాద్ లో 17,700 కుటుంబాలుంటే ఇప్పటికీ 14 వేల కుటుంబాలకు పూర్తి స్థాయిలో దళితబంధు  (Dalitha Bandu) అందలేదని బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ (Etela Rajender) ఆరోపించారు. దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం లేదు, కేవలం హుజూరాబాద్ లో కొందరికే అందిస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల కోట్లతో రాష్ట్రమంతా దళితబంధు ఇస్తానని చెప్పిన కేసీఆర్ (KCR), ఆ పని చేసి దళితులను ఆదుకోవాలని ఈటెల డిమాండ్ చేశారు.

Etela Rajender

ఎస్సీలలో 57 ఉపకులాలు ఉన్నాయని, కానీ వీరిలో ఎవరూ కూడా ఏనాడు చట్టసభల్లో అడుగు పెట్టలేదని చెప్పారు. ఇలాంటి వారిని ఏనాడు కేసీఆర్ ప్రభుత్వం గుర్తించలేదని అన్నారు. ప్రభుత్వ ఫలాలు అందడం లేదని ఎస్సీల్లోని 57 కులాలు అందోళనలు చేస్తూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా మోచీ, రెళ్లి, సింధు, డక్కలి, బుడగజంగాలు, మస్టి, మంగ కులాలకు ఏ ప్రభుత్వ పథకాలు, వాటి ఫలితాలు అందడం లేదన్నారు. కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేవని, సరైన విద్య అందడం లేదని ఆ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయని చెప్పారు. ఎస్సీలలో చాలా మంది కడు బీదరికంలో ఉన్నారనే విషయం కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేదన్నారు. తానే కుర్చీ వేసుకొని ఎస్సీలకు పథకాలను అమలు చేయిస్తానన్న కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

బలహీన వర్గాలు, బడుగు జాతులు సమాజంలో గట్టిగా నిలబడాలన్నా, ఆ జాతుల సమస్యలు పరిష్కారం కావాలన్నా…వారి ప్రతినిధి కూడా చట్టసభలో ఉండాలి అని అంబేద్కర్ చెప్పారు. కానీ వీరిలో చాలా మంది అసెంబ్లీ మెట్లు కూడా చూడలేదని అన్నారు. ఇటువంటి వారికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జాతుల వారు తమ తలరాతల మారిపోతాయని, చాలా ఊహించుకున్నారు. కానీ పెనం మీద నుంచి పోయిలో పడినట్లైయ్యింది కానీ, ఒరిగింది ఏమీ లేదని తేలిదంన్నారు.

57 ఉప కులాల డిమాండ్లపై ఉద్యమ బిడ్డగా తాను గొంతెత్తి మాట్లాడుతున్నానని ఈటెల రాజేందర్ అన్నారు. వీరి సమస్యలు పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తున్నానని చెప్పారు. ఎస్సీల హక్కుల సాధన కోసం చైతన్యంతో ఉండాలని, హక్కుల సాధన విషయంలో ఆగం చేయాలి తప్ప, ఆగం కావద్దని సూచించారు. చిన్న కులమంటూ సమాజంలో చిన్న చూపున్నా కూడా, చైతన్యంలో చాలా పెద్ద వాళ్లమని గుర్తుంచుకోవాలని అన్నారు.

You may also like

Leave a Comment