హైదరాబాద్ లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియన వ్యక్తి జరిపిన కాల్పుల్లో దేవేందర్ గాయన్ (35) మరణించాడు. మృతుడు మదీనా గూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్(elite restaurant)లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం.
విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న దేవేందర్ గాయన్(Devender Gayan)పై ఓ వ్యక్తి కంట్రీ మేడ్ పిస్టల్ తో 5 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యాడు.ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన దేవేందర్‌ను హోటల్ సిబ్బంది హుటాహుటిన దగ్గరలోని అర్చన ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న దేవేందర్ మృతి చెందారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయాన్ గత ఆరు నెలల క్రితమే సందర్శిని హోటల్లో మేనేజర్ గా పనిలో చేరాడు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ గోనె సందీప్ మాట్లాడుతూ..గుర్తు తెలియని వ్యక్తి కంట్రీ మేడ్ పిస్టల్ తో కాల్పులు జరిపాడని
చికిత్స పొందుతూ దేవేందర్ మృతి చెందాడని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు టీమ్‌లు రంగంలోకి దిగాయని త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించి క్లూస్ టీమ్(Clues Team) ఆధారాలను సేకరిస్తుంది.
అయితే ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ప్రేమ వ్యవహారమే కారణమని, సందర్శిని హోటల్లో పనిచేస్తున్న అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే కారణమని సమాచారం.అయితే హైదరాబాద్ మియాపూర్ కాల్పుల కేసులో పురోగతి వచ్చింది.
దేవేందర్ పై కాల్పులు జరిపిన వ్యక్తిని రిత్విక్(Ritwik)గా పోలీసులు గుర్తించారు. దేశీయ పిస్టల్ తో రిత్విక్ 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. అక్రమ సంబంధం కారణంతో కాల్పులు జరిపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.