Telugu News » Fired Show room : విజయవాడలో అగ్ని ప్రమాదం…భారీస్థాయిలో ద్విచక్ర వాహనాలు దగ్ధం !

Fired Show room : విజయవాడలో అగ్ని ప్రమాదం…భారీస్థాయిలో ద్విచక్ర వాహనాలు దగ్ధం !

విజయవాడ కేపీ నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. గురువారం తెల్లవారు జామున టీవీఎస్‌ వాహనాల షోరూమ్ నందు మంటలు చెలరేగడంతో షోరూమ్ సహా గోదాంలో ఉన్న దాదాపు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.

by sai krishna

విజయవాడ కేపీ నగర్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాద చోటుచేసుకుంది. గురువారం తెల్లవారు జామున టీవీఎస్‌ వాహనాల షోరూమ్ నందు మంటలు చెలరేగడంతో షోరూమ్ సహా గోదాంలో ఉన్న దాదాపు 300 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.

దగ్ధమైన వాటిలో ఎలక్ట్రికల్ ద్విచక్రవాహనాలు(Electric two-wheelers)కూడా ఉన్నాయి.అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్ల(Fire engines)తో గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో టీవీఎస్‌ షోరూమ్(TVS Showroom)ఉంది. ఈరోజు తెల్లవారుజామున షోరూంలోని మొదటి అంతస్తులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే ఆ మంటలు గోదాంకూ విస్తరించాయి.

ఇది గమనించిన సెక్యూరిటీ.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 3 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రీఫ్యాబ్రిక్‌(Pre fabric) పద్ధతిలో నిర్మించిన షోరూం కావడంతో మంటలు వేగంగా విస్తరించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.


గోదాంలో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయని పేర్కొన్నారు.పోలీసులు టీవీఎస్‌ షోరూమ్ చేరుకుని విచారణ చేపట్టారు.

పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాం సమీపంలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా ఉంచడం, వాటిని ఛార్జింగ్‌ పెట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లా(Krishna District)కు చెందిన టీవీఎస్‌ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం. దాంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడే ఉంచుతారు.

షోరూమ్ సహా సర్వీస్‌ సెంటర్‌‌లను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో షోరూమ్, గోదాం, సర్వీస్‌ సెంటర్‌ ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి. ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

You may also like

Leave a Comment