హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీనగర్(LB Nagar)లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు యూటర్న్(Uturn) చేస్తుండగా రాంగ్ రూట్లో వెళ్తున్న బైక్ ఒక్కసారిగా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతుడు చార్మినార్ ఎక్సెజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాదిక్ అలీగా గుర్తించారు. నారాయణగూడ ఎక్సెజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్ఎస్ ఖాజావలీ మొహినుద్దీన్ ఈ ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. మలక్ పేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో సీఐ సాదిక్ అలీ, ఎస్ఐ మొహినుద్దీన్ ఉంటున్నారు.
ఎల్బీనగర్లో ఓ కార్యక్రమానికి వెళ్లి మలక్‌పేట్‌లోని తన క్వార్టర్స్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ పరారయ్యాడు.
కారుపై ఓవర్ స్పీడ్ చలాన్లు వున్నట్లు పోలీసులు గుర్తించారు. వినుషా శెట్టి పేరుపై కారు రిజిస్ట్రేషన్ ఉందని తెలిపారు. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ చలాన్స్ ఉండటంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.