Telugu News » GHMC : 10 వేల టన్నుల నిమజ్జన వ్యర్థాల సేకరణ

GHMC : 10 వేల టన్నుల నిమజ్జన వ్యర్థాల సేకరణ

నిమజ్జన వ్యర్థాలను సేకరించి, డంపింగ్ యార్డ్ కు తరలించే పనులు శుక్రవారం సాయంత్రం వరకు సాగాయని, ఆ తర్వాత హుస్సేన్ సారగ్ చుట్టూ రాత్రి వరకు కార్మికులు శుభ్రం చేశారని అధికారులు తెలిపారు.

by Prasanna
Nimarjjanam

హైదరాబాద్ (Hyderabad) గణనాధుల నిమజ్జనం ముగిసింది. రెండు రోజుల పాటు సాగిన ఈ నిమజ్జనంలో 10 వేల మెట్రిక్ టన్నుల పూజా సామాగ్రి, ఇతర వ్యర్థాలను సేకరించినట్లు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు తెలిపారు. ఈ వ్యర్థాలను నగర శివారులోని డంపింగ్ యార్డు (Damping Yard)కు తరలించినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

Nimarjjanam

రెండు రోజుల పాటు సాగిన శోభాయాత్ర బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు, అలాగే ఖైరతాబాద్ నుంచి క్రేన్ నెం 4 వరకు సాగిన ఖైరతాబాద్ గణనాధుడి నిమజ్జనం, ఇంకో వైపు ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ వరకు జరిగిన నిమజ్జన యాత్రలలోని వ్యర్థాలను సేకరించేందుకు 10 వేల 4 వందల మంది కార్మికులు పని చేశారని అధికారులు తెలిపారు.

 

నిమజ్జన వ్యర్థాలను సేకరించి, డంపింగ్ యార్డ్ కు తరలించే పనులు శుక్రవారం సాయంత్రం వరకు సాగాయని, ఆ తర్వాత హుస్సేన్ సారగ్ చుట్టూ రాత్రి వరకు కార్మికులు శుభ్రం చేశారని అధికారులు తెలిపారు. అలాగే వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ శాశ్వత, తాత్కాలిక పద్దతుల్లో ఏర్పాటు చేసిన 74 నిమజ్జన కొలనుల నుంచి మరో వెయ్యి మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.

 

మొత్తం ఈ వ్యర్థాలన్నింటిని తొలగించేందుకు 110 జేసీబీలను ఉపయోగించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ లతో పాటు మరికొన్ని చెరువులు, కొలనుల్లో చెత్తను ఇంకా సేకరించే పనులు జరుగుతున్నాయని, ఈ పనులు శనివారం కూడా కొనసాగుతాయని తెలిపారు.

 

You may also like

Leave a Comment