పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అటు కాంగ్రెస్(Congress) పార్టీకి, ఇటు ఇండియా కూటమికి వరుసగా షాకులు తగులుతున్నాయి. హస్తం పార్టీలోని కీలక జాతీయ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్(Gourav Vallab) పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి గురువారం రాజీనామా(Resignation) చేసి ట్విట్టర్(ఎక్స్-X)లో పోస్టుచేశారు.
‘ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న దిక్కులేని మార్గం నన్ను అసౌకర్యానికి గురిచేస్తుంది. నేను సనాతన్(Sanathan) వ్యతిరేక నినాదాలకు మద్దతు ఇవ్వలేను. దేశ సంపద సృష్టి కర్తలను రోజూ విమర్శించలేను. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని పదవులను, ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని రాసుకొచ్చారు.
ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు రాసిన లేఖలో కొన్ని ముఖ్యమైన అంశాలను పేర్కొన్నారు. అవేంటంటే.. ‘సార్ నేను పైనాన్స్ ప్రొఫెసర్‌ను. కాంగ్రెస్ లో చేరాక నన్ను జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు.నా విధులను సమర్థవంతంగా నిర్వర్తించాను.సనాతన్‌ను అగౌరవపరిచే దాని మిత్రపక్షాల పట్ల కాంగ్రెస్ పార్టీ మౌనం పరోక్ష అంగీకారం వంటిది.
అయోధ్య శ్రీరాముడి ప్రతిష్టాపన టైంలో కాంగ్రెస్ వైఖరితో నేను ఇబ్బంది పడ్డాను. పుట్టుకతో నేను హిందువును. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా ఉన్న నాకు పార్టీ పనితీరు నన్ను అశాంతికి గురిచేసింది. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలకు చెందిన వ్యక్తులు సనాతన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చలేదు.కాంగ్రెస్ అనుసరిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలను నేను ఫాలో అవ్వలేను’ అంటూ లేఖలో ఆయన ఎత్తిచూపారు.