మద్యం మత్తులో ఓ యువకుడు మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. తాను తాగే బీరును మహిళలపై చల్లుతూ దాడికి పాల్పడ్డాడు ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వర్షకొండ గ్రామానికి చెందిన ఆరెపల్లి గంగజాలతో పాటు మరికొందరు గురువారం సాయంత్రం సమయంలో మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బైక్‌పై బీరు తాగుతూ వస్తున్నాడు. అయితే చేతిలో బీరును బతుకమ్మ ఆడుతున్న మహిళలపై చల్లాడు.
దీంతో అక్కడున్న మహిళ ఎదురించగా నన్నే ఎదురిస్తావా? అంటూ ఆరెపల్లి గంగజాలపై కర్రతో దాడి చేశాడు. అది గమనించిన భర్త మహేష్ వచ్చి అడ్డుకోగా భర్తతో పాటు మరో ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మహేష్‌కు తీవ్ర గాయాలు అవగా మెట్‌పల్లిలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్చారు.
భార్య గంగుల చేతికి గాయం అవ్వగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయితే మూడు రోజులుగా నిందితుడిని పట్టుకోవడం లేదని సంఘ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఇక్కడ న్యాయం జరగకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితుడి భార్య గంగజల తెలిపింది.