ఐస్‌ల్యాండ్ (Ice Land) పై ప్రకృతి ప్రకోపించింది. వరుస భూకంపాల (Earthquakes)తో ఐస్‌ల్యాండ్ పై ప్రకృతి కన్నెర్ర జేసింది. 14 గంటల్లో ఏకంగా 1800 భూకంపాలు సంభవించడంతో ఐస్‌ల్యాండ్ దేశం వణికి పోయింది. దేశంలోని నైరుతి రేక్‌జానెస్ ద్వీపకల్పంలో వరుస శక్తివంతమైన భూకంపాలు సంభవించిన నేపథ్యంలో ఐస్ ల్యాండ్ అత్యవసర పరిస్థితి విధించింది.
గ్రిందావిక్‌కు ఉత్తరాన ఉన్న సుంధంజూకాగిగార్ వద్ద తీవ్రమైన భూకంపం సంభవించిన కారణంగా పౌరుల రక్షణ కోసం నేషనల్ పోలీసు చీఫ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్టు సివిల్ ప్రొటెక్షన్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని తీవ్రమైన భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
ఇది అగ్నిపర్వత విస్పోటనానికి ముందస్తు హెచ్చరికలు అయి వుండవచ్చి పేర్కొంది. ఈ విస్పోటనం చాలా రోజుల వరకు జరిగే అవకాశం ఉందని ఐస్లాండిక్ మెటా ఆఫీస్ (IMO)ప్రకటనలో చెప్పింది. నిన్న సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో రెక్ జావిక్ కు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో రెండు సార్లు భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు.
దేశంలోని దక్షిణ తీరంలో చాలా వరకు, కిటికీలు మరియు గృహోపకరణాలు ధ్వనించాయి. భూకంపం నేపథ్యంలో పలు ప్రకంపనలు సంభవించాయన్నారు. ఐఎంఓ ప్రాథమిక సమాచారం ప్రకారం…. గ్రిందావిక్‌కు ఉత్తరాన 5.2 తీవ్రతతో అతిపెద్ద ప్రకంపనలు నమోదైనట్టు అధికారులు చెప్పారు.