దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధాన రాజకీయ పార్టీలు(POlitical Parties) ఒకరిపై మరోకటి విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ(BJP), అధికార డీఎంకే(DMK) పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అక్కడి పరిస్థితులు తయారయ్యాయి.
తాజాగా సీఎం స్టాలిన్‌పై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ (Tamili sye Sounder Rajan) సోషల్ మీడియా వేదిక (ఎక్స్) ద్వారా ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీ ముస్లిం జనాభాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ స్పందించారు.
ప్రధాని వ్యాఖ్యలు విషపూరితంగా, విద్వేషాలను రెచ్చగొట్టేల ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తమిళనాడు సీఎం కామెంట్స్‌పై బీజేపీ చెన్నై సౌత్ ఎంపీ అభ్యర్థి తమిళి సై కౌంటర్ ఇచ్చారు.
TN CM @mkstalin calls honb @PMOIndia speech in Rajasthan as toxic. What about your son @Udayanidhi called Sanatan Dharma to be eradicated like Dengue or malaria. You were watching him attacking HINDU sentiments with such poisonous words against HINDU population. Will you regret?
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisai4BJP) April 22, 2024
‘ప్రధాని మోడీ రాజస్థాన్ ప్రసంగం విషపూరితమైనదే అయితే మీ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా కంటే ప్రమాదమైనదని చేసిన వ్యాఖ్యల సంగతేమిటి. హిందూ జనాభా, హిందువుల భావోద్వేగాలపై మీ కుమారుడు తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నందుకు మీరెప్పుడైనా చింతించారా? అని తమిళి సై సౌందర్ రాజన్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాగా, ఈసారి తమిళనాడులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఊహించిన స్థాయిలో సీట్లు వస్తాయని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు.