Telugu News » Aravind Kejriwal : ఈడీ సమన్లు చట్ట విరుద్దమైనవి…. వాటిని ఉపసంహరించుకోవాలి…..!

Aravind Kejriwal : ఈడీ సమన్లు చట్ట విరుద్దమైనవి…. వాటిని ఉపసంహరించుకోవాలి…..!

ఈడీ సమన్లు రాజకీయంగా ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తాను న్యాయమైన ఈడీ సమన్లను అంగీకరిస్తానని వెల్లడించారు.

by Ramu
Illegal politically motivated Arvind Kejriwal on probe agency ED summons

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED)సమన్లపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) స్పందించారు. సమన్లను చట్ట విరుద్ధమైనవి (Illeagal)గా పేర్కొన్నారు. ఈడీ సమన్లు రాజకీయంగా ప్రేరేపితమైనవని మండిపడ్డారు. తాను న్యాయమైన ఈడీ సమన్లను అంగీకరిస్తానని వెల్లడించారు.

Illegal politically motivated Arvind Kejriwal on probe agency ED summons

కానీ ప్రస్తుత ఈడీ సమన్లు కూడా గతంలో మాదిరిగానే అక్రమమైనవని, ఇవి రాజకీయంగా ప్రేరేపించబడినవని అన్నారు. ఈడీ జారీ చేసిన సమన్లు ఉపసంహరించుకోవాలని అన్నారు. తాను జీవతంలో అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా గడిపానని చెప్పారు. తన జీవితంలో దాచడానికి ఏమీ లేదన్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్‌కు ఇటీవల ఈడీ సమన్లు పంపింది. ఈ కేసుకు సంబంధించి ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఈడీ విచారణకు ఆయన హాజరవుతారా లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది. విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత నెలలో కూడా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ ఈడీ సమన్లు చట్ట విరుద్దమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవి కేజ్రీవాల్ అన్నారు. అందుకే విచారణకు హాజరు కాలేనన్నారు. తాజాగా మరోసారి అదే కారణం చెబుతూ విచారణకు గైర్హాజరు అవుతుండటంతో ఈడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

You may also like

Leave a Comment