Telugu News » Kohli’s Request : ఐయామ్ టైర్డ్…ఎక్కువ ప్రశ్నలడక్కిండి ప్లీజ్..!

Kohli’s Request : ఐయామ్ టైర్డ్…ఎక్కువ ప్రశ్నలడక్కిండి ప్లీజ్..!

ఆసియా -2023 క్రికెట్ కప్(Asia-2023 Cricket Cup) ను భారత్ సొంతం చేసుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్ ను 228 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

by sai krishna

ఆసియా -2023 క్రికెట్ కప్(Asia-2023 Cricket Cup) ను భారత్ సొంతం చేసుకుంది. సూపర్‌-4 మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్ ను 228 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి పాకిస్తాన్‌ను ఫట్ ఫట్లాడించింది.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ(Virat Kohli) విజృంభించాడు. 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అద్భుత ఇన్నింగ్స్ తో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.


మ్యాచ్ అనంతరం విరాట్‌ కోహ్లీ మాట్లాడుతూ…‘ఇంటర్వ్యూ చిన్నదిగా ఉండేలా చూడండి. ఎందుకంటే నేను చాలా అలసిపోయాను. నేను జట్టుకు సహాయపడేందుకు ఎప్పుడూ అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాను.

ఈ రోజు కేఎల్‌ రాహుల్‌ మంచి ఆరంభం ఇచ్చాడు. నా పని కేవలం స్ట్రైక్‌ రొటేట్‌ చేయడమే. సులభంగా పరుగులు రాబట్టడం సంతోషంగా ఉంది. నేను కొట్టిన రివర్స్‌ ర్యాంప్‌ బౌండరీపై నాకు గౌరవం ఉంది. ఎందుకంటే సెంచరీ తర్వాత ఆ షాట్ ఆడాను’ అని అన్నాడు.

‘కేఎల్‌ రాహుల్‌(KL Rahul)తో నా భాగస్వామ్యం చాలా గొప్పది. ఇది టీమిండియాకు మంచి సంకేతం. రాహుల్ వన్డే క్రికెట్‌లో గొప్పగా పునరాగమనం చేయడం ఎంతో ఆనందం కలిగించే విషయం.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీలంకతో మ్యాచ్‌ ఉంది.అదృష్టవశాత్తు మేం టెస్టు ప్లేయర్లం. నేను 100కు పైగా టెస్టులు ఆడాను. కాబట్టి మరుసటి రోజు తిరిగి వచ్చి ఎలా ఆడాలో తెలుసు. నవంబర్‌లో నాకు 35 ఏళ్లు వస్తాయి.

కాబట్టి నేను కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి (నవ్వుతూ). గ్రౌండ్స్‌ మెన్‌(Grounds Men)లకు పెద్ద కృతజ్ఞతలు. వర్షం పడినా కూడా వారు మైదానాన్ని బాగా సిద్ధం చేశారు’ అని విరాట్ కోహ్లీ తెలిపాడు.

You may also like

Leave a Comment