Telugu News » SA vs IND : చెలరేగిన విరాట్ కోహ్లీ…. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం…!

SA vs IND : చెలరేగిన విరాట్ కోహ్లీ…. దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం…!

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇరగ దీశారు.

by Ramu

ప్రపంచ కప్‌ (World Cup)లో టీమిండియా (Team India) దూసుకు పోతోంది. వరుసగా ఏడో విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు ఇరగ దీశారు. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు తడబడటంతో 83 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికాపై 243 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

 

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 326 పరుగులు చేసింది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డీకాక్ కేవలం 5 పరుగులు చేసి మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ తెంబా బావుమా 11 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు.

ఓపెనర్లు ఇద్దరు అతి తక్కువ పరుగులకే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు వెంట వెంటనే తక్కువ పరుగులకే పెవీలియన్ బాట పట్టారు. దీంతో 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగలకే సౌత్ ఆఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. సఫారీల జట్టులో తెంబా బావుమా (11), వాండర్ డస్సేన్ (13), డేవిడ్ మిల్లర్ (11), మాక్రో జస్సన్ (14) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీలు రెండేసి వికెట్లు తీశారు. మహ్మద్ సిరాజ్ ఒక వికేట్ తీశారు. అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 40 పరుగులు చేసి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (101 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (77) విజృంభించడంతో భారత్ భారీ స్కోరు (326) చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడీ, మార్కో జాన్ సేన్, కగిసో రబాడా, కేశవ్ మహారాజ్, తబ్రెయిజ్ శాంసీలు తలో వికెట్ తీశారు.

You may also like

Leave a Comment