దేశంలో కరోనా (Corona) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నిన్న మరో 412 కొవిడ్ కేసులు (Covid-19 Cases) నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కు చేరుకుంది. కర్ణాటకలో కరోనాతో ముగ్గురు మరణించినట్టు అధికారులు తెలిపారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి మొత్తం సంఖ్య 5,33,337కు చేరుకుంది.
దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,09,660కు పెరిగింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. కొవిడ్ మరణాల రేటు 1.19 ఉన్నట్టు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. ఇది ఇలా వుంటే కొవిడ్ ఉపరకం జేఎన్ 1 కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం నాటికి జేఎన్ 1 కేసుల సంఖ్య 69కి చేరుకుంది.
జేఎన్ -1 రకం కేసులు అత్యధికంగా గోవాలో 34 కేసులున మోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో రెండు, తెలంగాణలో రెండు చొప్పున కేసులు నమోదైనట్టు అధికారులు వివరించారు. తాజాగా నమోదైన 6 జేఎన్.1 రకం కేసులతో కలిపితే కొత్త రకం కేసుల సంఖ్య 69కి చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లను పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు అన్నారు.
కరోనా కేసులు రోజు రోజుకూ పెరగుతుండటంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే ప్రజలు నిర్లక్ష్యం చేయవదద్దని సూచనలు చేసింది.ద ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పాటించడం, పరిశుభ్రత విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.