Telugu News » Canada Visa: కెనడా వీసా ప్రక్రియ పున: ప్రారంభం…. వెల్లడించిన భారత్..!

Canada Visa: కెనడా వీసా ప్రక్రియ పున: ప్రారంభం…. వెల్లడించిన భారత్..!

నేటి నుంచి కెనడా వీసాల ప్రక్రియను పాక్షికంగా పునరుద్దరిస్తున్నట్టు కెనడాలోని భారతీయ హైకమిషన్ వెల్లడించింది.

by Ramu

కెనడా (Canada)తో దౌత్యపరమైన ప్రతిష్టంభనల నేపథ్యంలో ఆ దేశ వీసా (Visa)ల ప్రక్రియను ఇటీవల భారత్ (INDIA) రద్దు చేసింది. నేటి నుంచి కెనడా వీసాల ప్రక్రియను పాక్షికంగా పునరుద్దరిస్తున్నట్టు కెనడాలోని భారతీయ హైకమిషన్ వెల్లడించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సేవలను పునరుద్దరిస్తున్నట్టు పేర్కొంది.

పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపింది. అంతకు ముందు కెనడాలోని భారతీయ దౌత్య వేత్తల భద్రతలో పురోగతి ఉంటే కెనడాకు వీసా సేవలను పున: ప్రారంభిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వివరించారు.

ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్- కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. నిజ్జర్ హత్య వెనుకు భారత్ హస్తం ఉందన్న కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. భారత దౌత్య వేత్తను బహిష్కరిస్తు కెనడా తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడింది.

ఈ నేపథ్యంలో భారత్ లోని కెనడా దౌత్య వేత్తను బహిష్కరిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వీసా సేవలు రద్దయ్యాయి. ఇటీవల భారత్‌లోని 41 మంది కెనడా దౌత్య వేత్తలను ఆ దేశం రీకాల్ చేసింది.

You may also like

Leave a Comment