హిమాచల్ ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. సిమ్లా(Shimla)లో ఉన్న ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ(IIAS) సెంటర్ బిల్డింగ్ చుట్టు ఉన్న లాన్ పరిసరాల్లో..రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో విస్త్రీర్ణం తగ్గిపోతోంది.
అక్కడ ఉన్న మట్టి కిందకు జారిపోవడం వల్లే..సమ్మర్ హిల్ ప్రాంతంలో ఉన్న శివాలయం శిధిలమైంది.ఆ ఆలయంలో సుమారు 20 మంది వరకు సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే ఐఐఏఎస్ ఇన్స్‌టిట్యూట్ బయట ఉన్న లాన్ చివరే కొండచరియలు(Landslides)విరిగిపడ్డాయి.
ఆ ఇన్స్‌టిట్యూట్‌కు ఉన్న ఫెన్సింగ్ కూడా ఆ మట్టిచరియల్లో కొట్టుకుపోయింది. దీంతో పాటు ఆ పచ్చిక మైదానంలో ఉన్న చాలా వరకు దేవదరు వృక్షాలు కూడా నేలమట్టం అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఐఐఏఎస్ కేంద్ర ప్రభుత్వాని(Central Govt)కి లేఖ రాసింది. ఇన్స్‌టిట్యూట్ భద్రత కోసం రక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. స్టేట్ డిజాస్టర్ అథారిటీతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఆ స్పాట్‌ను విజిట్ చేశారు. వాస్తవానికి ఐఐఏఎస్ వద్ద కొండచరియలు విరిగిపడిన లాన్ దిశలో ప్లాస్టిక్ షీట్ల(Plastic sheets)ను అమర్చారు.
కానీ కొండచరియలు విరుచుకు పడుతున్న తీవ్రతకు కింద ఉన్న రోడ్లు, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయాయి. శివాలయం కూడా ఆ మట్టిలోనే ధ్వంసమైంది. ఐఐఏఎస్ నుంచి దాదాపు 800 మీటర్ల కిందకు కొండచరియలు కొట్టుకుపోయాయి.ఇక ఐఐఏఎస్ పరిసరాల్లో ఉన్న ఓ రోడ్డు కూడా కృంగిపోతున్నట్లు అధికారులు చెప్పారు.
అయితే ఆ కృంగుతున్న దిశగా వర్షపు నీరు వెళ్లకుండా చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. క్లౌడ్ బస్ట్(Cloud bust) వల్లే కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నా…వాతావరణ శాఖ మాత్రం దానికి భిన్నంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.
క్లౌడ్ బస్ట్ అయ్యేంత రేంజ్‌లో వర్షం పడలేదని, కొండపై మట్టి చాలా విశాల విస్తీర్ణంలో కొట్టుకుపోందన్నారు. కొండచరియలు విరిగిపడ్డ సమ్మర్ హిల్ ప్రాంతంలో ఇవాళ(18.08.23) ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూ శిథిలాలను తొలగిస్తున్నారు.