రైల్వే ప్రయాణం (Train journey) చేసేవారికి అతి ముఖ్యమైన గమనిక. వివిధ కారణాలతో ఇటీవల తరచూ రైళ్లు రద్దవుతున్నాయి. ఈసారి ఏకంగా 300 రైళ్లు రద్దు కానుండటం విశేషం. ఇంకొన్ని రైళ్లుు రూట్ మళ్లించనున్నారు. ఇంతపెద్దఎత్తున రైళ్లు రద్దుకు కారణాలేంటో చూద్దాం.
దేశంలో గత కొద్దికాలంగా తరచూ వివిధ కారణాలతో రైళ్లు రద్దవుతుండటం(Cancelled) తో ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే విజయవాడ పరిధిలో హైదరాబాద్, చెన్నై రైళ్లు రద్దవడంతో సమస్య ఎదురైంది. ఈసారి నార్తర్న్ రైల్వే పరిధిలో ఏకంగా 300 రైళ్లు(300 Trains) రద్దు కానున్నాయి. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జీ20 శిఖరాగ్ర (G20 Meeting)సమావేశం జరగనుంది.
ఈ సమావేశానికి ప్రపంచం నలుమూలల్నించి దేశాధినేతలు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. పలు మార్గాల్ని నిషేధించింది. ఢిల్లీలో అయితే దుకాణాలు, వ్యాపారాలు, ఇతర సంస్థలు మూసివేయనున్నారు. ప్రయాణీకుల రద్దీ తగ్గించేందుకు ఇప్పుడు తాజాగా రైళ్లు కూడా రద్దు చేశారు.
సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ మూడ్రోజులపాటు ఉత్తర రైల్వే పరిధిలో ఏకంగా 200 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరో 100 రైళ్లను మార్గం మళ్లిస్తున్నారు. కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ అవుతున్నాయి. మరి కొన్ని రైళ్లు టెర్మినల్ ఛేంజ్ అవుతున్నాయి. ఉత్తర రైల్వే ఈ మేరకు ఏయే రైళ్లు రద్దయ్యాయి, ఏయే రైళ్లు రూట్ మారుతున్నాయనే వివరాలతో జాబితా విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ ఢిల్లీ ఇతర సమీప ప్రాంతాలకు వెళ్లే ఆలోచన లేదా రిజర్వేషన్ చేయించుకున్నవారు ఈ జాబితా చెక్ చేసుకోవాలి.