వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World economic forum)అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రాబోయే సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ(Global economy) బలహీన పడే (Weaken)అవకాశం ఉన్నట్టు తెలిసింది. అస్థిరమైన రాజకీయ, ఆర్థిక విషయాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాజకీయ, ఆర్థికపరమైన ఒడిదుడుకుల సంభవించే అవకాశాలు ఉన్నందున ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చేరుకోక పోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. అయితే దక్షిణ ఆసియాలో బలమైన లేదా ఓ మోస్తారు అభివృద్ది చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా భారత్ అధికంగా అభివృద్ధి సాధించే అవకాశాలు వున్నాయని 90 శాతం ఆర్థిక వేత్తలు నమ్ముతున్నారు. ఇదే సమయంలో, దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా చైనా ఔట్‌లుక్ మసకబారిందని డబ్ల్యూఈఎఫ్ తాజా ‘చీఫ్ ఎకనామిస్ట్ ఔట్‌లుక్’ నివేదిక పేర్కొంది.
అగ్రరాజ్యం అమెరికాలో 2023,2024లో అధిక వృద్ధి చోటు చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారని నివేదిక తెలిపింది. యూరప్ లో వచ్చే ఏడాది 77 శాతం వృద్ధి క్షీణత నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. టీవల ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు తగ్గిపోతాయని 86 శాతం మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.