Telugu News » Modi: భారత్‌లో తయారైన ఫోన్లనే ప్రపంచమంతా వాడుతోంది…..!

Modi: భారత్‌లో తయారైన ఫోన్లనే ప్రపంచమంతా వాడుతోంది…..!

బీజేపీ (BJP) తొమ్మిదేండ్ల పాలనలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకోసిస్టమ్‌గా భారత ఎకోసిస్టమ్ మారిందన్నారు.

by Ramu

మన భవిష్యత్ ఇప్పుడు దశాబ్దం లేదా ఒక శతాబ్దం దూరంలో లేదని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భవిష్యత్ ఇప్పుడు, ఇక్కడే ఉందన్నారు. బీజేపీ (BJP) తొమ్మిదేండ్ల పాలనలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకోసిస్టమ్‌గా భారత ఎకోసిస్టమ్ మారిందన్నారు. ఇప్పుడు ప్రపంచంలో మనం మూడవ స్థానంలో వున్నామని చెప్పారు.

ఢిల్లీలోని ప్రగతి మైదాన్​లోని భారత్​ మండపంలో 7వ ఇండియన్​ మొబైల్ కాంగ్రెస్ (IMC)​ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ….. గతేడాది అక్టోబర్ 2న దేశంలో 5జీ టెక్నాలజీని ప్రారంభించామని ప్రధాని గుర్తు చేశారు. ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం ఇప్పుడు పంచమంతా భారత్​లో తయారైన ఫోన్లనే ఉపయోగిస్తోందని అన్నారు. 2014లో ప్రారంభమైన కృషి వల్ల ఈ తొమ్మిదేండ్ల కాలంలో భారత్ టెక్నాలజీ దిగుమతి దారు నుంచి ఎగుమతి దారుగా ఎదిగిందన్నారు. శాంసంగ్ కంపెనీకి చెందిన​ ఫోల్డ్​ 5 మొబైల్స్​, యాపిల్ కంపెనీకి సంబంధించిన ఐఫోన్​ 15 ఇప్పుడు ఇండియాలోనే తయారవుతున్నాయని వివరించారు. ఇటీవలే దిగ్గజ గూగుల్ కంపెనీ భారత్​లోనే తమ పిక్సెల్​ ఫోన్లను తయారుచేస్తామని ప్రకటించిందన్నారు.

గతంలో మొబైల్ బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ విషయంలో ప్రపంచంలో భారత్ 118వ స్థానంలో ఉండేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మనం 43వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు. టెక్నాలజీ భవిష్యత్ అంతా​ భారత్ లోనే ఉందని వెల్లడించారు. అతి త్వరలోనే 6జీ సేవలను అందించడంలోనూ భారత్ ముందు ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారని అన్నారు.

2014 అనేది కేవలం ఒక తేదీ కాదన్నారు. అది ఒక మార్పునకు నాంది పలికిందన్నారు. ఫోన్లు పాతబడితే ఇప్పుడు ఎవరూ వాడటం లేదన్నారు. ఒక వేళ ఎవరైనా వాటిని ఉపయోగించినా, అవి సరిగ్గా పనిచేయవన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ పరిస్థితి కూడా అలాగే మారిందని ఎద్దేవా చేశారు.

You may also like

Leave a Comment