ఖలిస్తాన్ (Khalisthan) వేర్పాటు వాద నేత హత్య విషయంలో భారత్ (India) – కెనడా (Canda) ల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులకు ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) తీవ్ర హెచ్చరికలు చేసింది. కెనడాలోని హిందువులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించింది.
ఈ మేరకు ఎస్ఎఫ్‌జే న్యాయ సలహాదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నన్ (Gurpatwant Singh Pannun) ఓ వీడియో విడుదల చేశాడు. అందులో ఇండో హిందువులంతా కెనడా విడిచి వెళ్లాలని సూచించాడు. భారత్ కు వెళ్లిపోవాలన్నాడు. మీరు కేవలం భారత్ కు మద్దతు ఇవ్వడం లేదు. ఖలిస్తాన్ అనుకూల వాదులపై అణిచి వేతకు సపోర్టు చేస్తున్నారంటూ మాట్లాడాడు.
మీరంతా షహీద్ నిజ్జర్ హత్యను సెలబ్రెట్ చేసుకుంటూ విధ్వంసాన్ని సపోర్టు చేస్తున్నారన్నాడు. కెనడాలోని ఖలిస్తాన్ అనుకూల సిక్కులను పన్నూ ఈ సందర్బంగా ప్రశంసించాడు. వారు ఎల్లప్పుడూ కెనడాకు విధేయులుగా వున్నారన్నాడు. దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని సమర్థించారని అన్నాడు. ఇధి ఇలా వుంటే పన్నూను ఇప్పటికే ఉగ్రవాదిగా భారత్ ప్రటించింది.
మరో వైపు కెనడాలోని భారత పౌరులు, విద్యార్థులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. భారతీయులపై హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వుండాలని సూచించింది. భారత వ్యతిరేక శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని తెలిపింది. అందువల్ల అంతా అలర్ట్ గా వుండాలని పేర్కొంది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపింది. వీలైనంత వరకు సమస్యాత్మక ప్రాంతాలకు దూరంగా వుండాలని సూచించింది.