Telugu News » HYD CP : ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు.. విచారణ స్పీడ్ అప్ చేశాం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

HYD CP : ఫోన్ ట్యాపింగ్‌తో వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు.. విచారణ స్పీడ్ అప్ చేశాం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంపై ఎట్టకేలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి (Hyd CP SRINIVAS REDDY) స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.

by Sai
Intruded into personal lives with phone tapping.. Investigation speeded up: CP Srinivas Reddy

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) వ్యవహారంపై ఎట్టకేలకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి (Hyd CP SRINIVAS REDDY) స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు.

Intruded into personal lives with phone tapping.. Investigation speeded up: CP Srinivas Reddy

ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు(PRABAKAR RAO) పైన ఎల్‌ఓసీ జారీ చేశామన్నారు. ఆ ఎల్ఓసీ ఇంకా ఫోర్సులోనే ఉందని వివరించారు. ప్రభాకర్ రావును పట్టుకునేందుకు ఇంటర్ పోల్‌ని ఇంకా సంప్రదించలేదని సీపీ తెలిపారు. మాజీ గవర్నర్ పేర్ల మీద కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారు.ట్యాపింగ్ జరిగిందా? లేదా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నాము.

సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారం పైన స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము.వ్యక్తిగత జీవితాల్లోకి ఫోన్ టాపింగ్ చేసి చొరబడ్డారు.
వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో నిందితులంతా చాలా స్మార్ట్ గా,ఇంటెలిజెంట్‌గా వ్యవహరించారు. తమ శక్తి మేరకు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో వ్యక్తిగత జీవితాలలోకి ప్రవేశించడం అనేది ఘోరమైన నేరం అని సీపీ స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా,ఈ కేసులో మెయిన్ హెడ్ అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఇటీవల పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రభాకర్ రావు మాత్రం క్యాన్సర్ చికిత్స కోసం 6 నెలల పాటు అమెరికా వెళ్లాడని, ట్రీట్మెంట్ అయ్యాక ఇండియా తిరిగి రానున్నట్లు డిపార్టుమెంటులోని ఓ పోలీసు అధికారంతో ప్రభాకర్ రావు కాల్ చేసి చెప్పినట్లు సమాచారం ఉంది.

 

You may also like

Leave a Comment