Telugu News » Komatireddy: దొంగ దీక్షలు ఇప్పుడు చేస్తే నడవదు.. కోమటిరెడ్డి సెటైర్లు..!

Komatireddy: దొంగ దీక్షలు ఇప్పుడు చేస్తే నడవదు.. కోమటిరెడ్డి సెటైర్లు..!

హరీశ్‌రావు నాటకాల రాయుడు మళ్ళీ జోకర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నా కోమటిరెడ్డి గుర్తుచేశారు.

by Mano
BTech Ravi: 'Would you talk about your own sister like that?' BTech Ravi's sensational comments...!

కాంగ్రెస్‌(Congress)ను విమర్శించడం బీఆర్ఎస్(BRS)నేతలు మానుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) అన్నారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరీశ్‌రావు దొంగదీక్షలు ఇప్పుడు చేస్తే నడవదన్నారు. హరీశ్‌రావు నాటకాల రాయుడు మళ్ళీ జోకర్‌లా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నా కోమటిరెడ్డి గుర్తుచేశారు.

BTech Ravi: 'Would you talk about your own sister like that?' BTech Ravi's sensational comments...!

గతంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదని అమాయకులను చంపిన వ్యక్తి హరీష్ రావు అని విమర్శించారు. మెదక్‌లో కనీసం డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ చేశారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా కేసీఆర్ రాలేదన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్న లైన్ మాత్రమే ఉండాలి.. హరీష్ రావు రాజీనామా పత్రాన్ని ఒకటిన్నర పేజీ రాశారన్నారని విమర్శించారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీశ్‌రావు నాటకాలాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు.

అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోగానే కేసీఆర్ పిచ్చినపట్టినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ వస్తే తొలి సీఎం దళితుడని నాడు కేసీఆర్ చెప్పారని దళితుడిని సీఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారన్నారు. పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కేసీఆర్ సీఎంగా ఉండాలన్నారని.. రెండో సారి బీఆర్ఎస్ వచ్చినా.. దళితుడిని సీఎం చేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్ని చక్కబెడుతూ పాలన సాగిస్తున్నామన్నారు.

అప్పులకు మిత్తిలు 26 వేల కోట్లు కట్టామని చెప్పారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 20ఏళ్ల కింద రూ.76కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు. మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 60 సార్లు సచివాలయానికి వచ్చాన్నారు. అపాయింట్‌మెంట్లు లేకుండానే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని తెలిపారు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదన్నారు. చెప్పిన హామీకి కట్టుబడి సోనియా తెలంగాణా ఇచ్చిందని ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు.

You may also like

Leave a Comment