ఐపీఎల్ ప్రాంచైజీలకు బీసీసీఐ విధించిన రిటెన్షన్(Retentions), రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్(Release players list) ప్రకటన గడువు నవంబర్ 26వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్-2024(IPL-2024)కు ముందు ముంబై ఇండియన్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కొందరు కీలక ఆటగాళ్లను రిలీజ్ చేసింది.
గతేడాది మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌కు గట్టి షాక్ తగిలింది. కామెరూన్ గ్రీన్‌ను ముంబై పూర్తి క్యాష్కు అమ్మేసింది. ఈ క్రమంలో ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి ఏకంగా 11మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది.
గతేడాది జరిగిన మినీ వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ముంబై ఇండిస్ ట్రేడ్ ద్వారా అమ్మేసింది. పూర్తి క్యాష్కు గ్రీన్‌ను ట్రేడ్ చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్ ట్రేడింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై తిరిగి జట్టులోకి తీసుకోనుంది.
ఇక విదేశీ ప్లేయర్లు జై రిచర్డ్సన్, క్రిస్ జోర్డాన్, ట్రిస్టియన్ స్టబ్స్ వంటి కీలక విదేశీ ప్లేయర్లను ముంబై వదిలేసింది. కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్‌లోనే కొనసాగిస్తోంది. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు మాత్రం షాక్ ఇచ్చింది. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై వేలానికి వదిలేసింది. ఆర్చర్.. గాయంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతూ వచ్చి.. ఈ ఏడాది పెద్దగా ప్రభావం చూపలేదు.
రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్: క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, డువాన్ జన్సెన్, రాఘవ్ గోయల్, ట్రిస్టన్ స్టబ్స్, జై రిచర్డ్ సన్, రిలే మెరిడిత్, సందీప్ వారియర్, రమణదీప్ సింగ్.
రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్రీత్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, విష్ణు వినోద్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్), నేహాల్ వధేరా, ఆకాష్ మధ్వల్, జాసన్ బెహ్రెండార్ఫ్, షమ్స్ ములానీ, కుమార్ కార్తికేయ.