– దుర్గాపూజ మండపాలపై దాడులు
– ఛాందసవాద ఇస్లామిక్ మూకల కుట్ర..
– ఉందంటున్న ఓపీ ఇండియా
– హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాల్లోనూ..
– దాడులు పెరుగుతున్నాయని ఆందోళన
– గతంలో జరిగిన దాడులను వివరిస్తూ..
– సంచలనాత్మక కథనం
దుర్గా పూజ హిందూ సంస్కృతిలో అంతర్భాగం. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు హిందువులు. దేశంలో పలు చోట్ల ఆలయాల్లో ఈ నవరాత్రుల్లో దుర్గా దేవీ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. అయతే.. కొంత కాలంగా దుర్గా పూజా మండపాలపై దాడులు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఛాందసవాద ఇస్లామిక్ మూకల దాడులు పెరుగుతున్నాయని ప్రముఖ ఆంగ్ల మీడియా ‘ఓపీ ఇండియా’ వెల్లడించింది.
ముఖ్యంగా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాల్లో ఈ దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2019లో అరుణాచల్ ప్రదేశ్ లో పాపమ్ పారే జిల్లాలోని దోయిముఖ్ లో పలు చోట్ల దుర్గా దేవీ విగ్రహాలపై ఛాందసవాద ఇస్లామిక్ మూకలు దాడులకు దిగాయి. కేసు నమోదు చేసిన పోలీసులు కారు నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అప్పట్లో ఈ ఘటనపై హిందూ సంఘాలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఏడాది బిహార్ లోని అర్వల్ మోద్ లో దుర్గా దేవీ నిమజ్జనానికి వెళ్తున్న హిందువులపై ఛాందసవాద ఇస్లామిక్ మూకలు రాళ్ల దాడి చేశాయి. దీంతో ఒక్కసారిగా భక్తులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మందికి పైగా గాయపడ్డారు. నలుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
యూపీలోని బలరామ్ పూర్ లో దుర్గా దేవీ ఊరేగింపుపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. రాళ్ల దాడి చేస్తున్న సమయంలో వారు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారని, ఓ పథకం ప్రకారమే దాడి చేశారని భక్తులు ఆరోపించారు.
గతేడాది సెప్టెంబర్ లో హైదరాబాద్ లో బుర్ఖా ధరించిన ఇద్దరు ముస్లిం మహిళలు దుర్గా దేవీ విగ్రహంపై దాడి చేశారు. ఖైరతాబాద్ లోని ఓ దుర్గా మండపంలోకి ప్రవేశించి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమపై ఓ ఇనుప రాడ్ తో దాడి చేశారని స్థానికులు తెలిపారు. ఆ తర్వాత స్థానికులు వాళ్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇలా పథకం ప్రకారం.. ఛాందసవాద ఇస్లామిక్ మూకలు హిందూ పండుగలపై దాడులకు పాల్పడుతున్నాయని ఓపీ ఇండియా తెలిపింది.