ఇజ్రాయెల్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గాజా స్ట్రిప్‌లో పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో ఇజ్రాయెల్ ఒక్క సారిగా ఉలిక్కి పడింది. గాజాలోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు అక్కడి పౌరులను ఊచకోత కోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు మిలిటెంట్లపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్ యుద్ద రంగంలా మారింది.
తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఘర్షణల అంశంపై మరో సారి చర్చ నడుస్తోంది. హమాస్ దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ కు హమాస్ మిలిటెంట్లకు మధ్య వైరం ఎందుకు వచ్చింది. తాజా దాడులు అసలు కారణమేంటో చూద్దాం.
ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం…!
1920-40 మధ్య పలు దేశాల నుంచి భారీ సంఖ్యలో యూదులు వచ్చి పాలస్తీనాలో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో అక్కడ వున్న అరబ్బులతో వారికి పొరపచ్చాలు వచ్చాయి. విభేదాల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో పాలస్తీనాను రెండుగా విభజించి ఇరు వర్గాలు సమానంగా పంచుకోవాలని ఐరాస ప్రతిపాదించింది. కానీ దానికి రెండు వర్గాలు ఒప్పుకోలేదు.
ఆ తర్వాత పాలస్తీనాలో మెజారిటీ భాగాన్ని యూదులు స్వాధీనం చేసుకుని దాన్ని ఇజ్రాయెల్ దేశంగా ప్రకటించారు. మరోవైపు పాలస్తీనాలో కొంత భాగాన్ని జోర్డాన్ స్వాధీనం చేసుకుని దానికి వెస్ట్ బ్యాంకు అని, మరి కొంత భూభాగాన్ని ఈజిప్టు స్వాధీనం చేసుకుని దానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఆ రెండు భూభాగాలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి పాలస్తీనా తన భూభాగం కోసం పోరాటం కొనసాగిస్తూ వస్తోంది.
హమాస్ నేపథ్యం..!
‘హమాస్’ను 1987లో ఏర్పాటు చేశారు. హమాస్ అనగా హరకత్ అల్ ముకావమాహ్ అల్ ఇస్లామియా( ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం). ఇది ఒక రాజకీయ పార్టీ. దీంతో పాటు ఇది ఇస్లామిస్ట్ మిలిటెంట్ గ్రూపు కూడా. 2007 గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వచ్చేసింది. దీంతో అక్కడ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి గాజా పరిపాలనను హమాస్ పర్య వేక్షిస్తోంది.
దాడులకు హమాస్ చెబుతున్న కారణాలివే…!
పాలస్తీనియన్ మహిళలపై గతంలో ఇజ్రాయెల్ దాడులు చేసిందని హమాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు తమకు అత్యంత పవిత్రమై మత ప్రదేశమైన జెరూసలెంలోని అల్ అక్సా మసీదును ఇజ్రాయెల్ అపవిత్రం చేసిందని హమాస్ ఆరోపిస్తోంది. ఆరోపించిన దాడులు మరియు ఇస్లాంలో కీలకమైన మతపరమైన ప్రదేశం అయిన జెరూసలేంలోని అల్-అక్సా మసీదును అపవిత్రం చేసిందని ఆరోపిస్తోంది. దీంతో పాటు ఇజ్రాయెల్ దేశాన్ని తాము గుర్తించడం లేదని అంటోంది. ఈ కారణాల నేపథ్యంలో దాడులు చేస్తున్నట్టు హమాస్ చెబుతోంది.