Telugu News » Israel : కొనసాగుతున్న యుద్దం… గాజా నుంచి పసిపిల్లలను తరలించేందుకు సిద్దమన్న ఇజ్రాయెల్ …!

Israel : కొనసాగుతున్న యుద్దం… గాజా నుంచి పసిపిల్లలను తరలించేందుకు సిద్దమన్న ఇజ్రాయెల్ …!

ఇప్పటికే వేలాది మంది పేషెంట్లు ప్రాణభయంతో గాజాను విడిచి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు.

by Ramu

హమాస్(Hamas)పై ఇజ్రాయెల్ (Israel) దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హమాస్ మిలిటెంట్లే లక్ష్యంగా అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్ సేనలు దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోని రోగులు ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఇప్పటికే వేలాది మంది పేషెంట్లు ప్రాణభయంతో గాజాను విడిచి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు.

 

యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో ఇద్దరు పసిపిల్లలు మరణించారని, డజన్ల మంది ప్రాణాపాయంలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో పిల్లలను గాజా నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సహాయం చేస్తామని ఇజ్రాయెల్ సేనలు వెల్లడించాయి.

మరోవైపు కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుపై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తోంది. కానీ కాల్పుల విరమణకు నెతన్యాహు ససేమేరా అంటున్నారు. హమాస్ మిలిటెంట్లు తమ వద్దగా బందీగా ఉన్న 239 మందిని విడుదల చేసిన తర్వాతే కాల్పుల విరమణ గురించి ఆలోచిస్తామన్నారు.

మరోవైపు ఉత్తర గాజాపై హమాస్ నియంత్రణ కోల్పోయిందని ఇజ్రాయెల్ పేర్కొంది. గాజాలో దాక్కునేందుకు హమాస్ మిలిటెంట్లకు స్థలం లేదని చెప్పింది. సిన్వార్ నుంచి చివరి ఉగ్రవాది వరకు హమాస్ మిలిటెంట్లు అందరూ మరణించారని ఇజ్రాయెల్ సేనలు తెలిపాయి. గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో సహాయక బృందాలతో కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

You may also like

Leave a Comment