ఇస్రో (ISRO) రాకెట్ ప్రయోగాలకు కౌంట్ డౌన్ (Countdown) వాయిస్ చెప్పే ఎన్. వారమతి కన్నుమూశారు. చంద్రయాన్-3కి కూడా ఆమె కౌంట్ డౌన్ చెప్పారు. అదే ఆమె చివరి కౌంట్ డౌన్ అనౌన్స్ మెంట్ అయ్యింది. గుండెపోటు (Heart attack)తో చెన్నైలోని ఆమె మరణించినట్లు ఇస్రో వర్గాలు చెప్తున్నాయి.
ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేసేటప్పుడు కౌంట్ డౌన్ కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఆ సమయంలో అంతా ఊపిరిబిగపెట్టి మరి ఆ కౌంట్ డౌన్ అనౌన్స్ మెంట్ వింటుంటారు. శాస్త్రవేత్తలైతే ఆ కౌంట్ డౌన్ స్టార్ అవ్వగానే ఉద్విగ్నతకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి సమయాల్లో అనేక సార్లు తన గంభీరమైన స్వరంతో వారమతి కౌంట్ డౌన్ చెప్పారు.
చంద్రయాన్-3 తో సహా అనేక ఇస్రో ప్రయోగాలకు ఆమె కౌంట్ డౌన్ చెప్పారు. నిన్న రాత్రి (శనివారం) ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చెన్నై ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మరణించారు.
ఈ వార్త తెలిసిన ఇస్రో శాస్రవేత్తలు ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నెటిజన్లు అయితే ఆమె గంభీరమైన వాయిస్ ను గుర్తు చేస్తుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.