ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3(Chandrayaan-3) ఏ ఆటకం లేకుండా ఆకాశంలోకి దూసుకెళ్లడమే కాదు, అక్కడ నుంచి వర్కింగ్ స్టిల్స్ పంపిస్తోంది. చంద్రయాన్ స్పేస్‌క్రాఫ్ట్(Space craft) తీసిన ఫోటోలను ఇవాళ ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3లో ఉన్న ల్యాండర్ ఇమేజ్ కెమెరాల(launder image camera’s) నుంచి భూమి(Earth)ని ఫోటో తీశారు. చంద్ర కక్ష్యలోకి అడుగు పెట్టిన స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి పర్మిషన్ లేకుండా అతగాడి ఫోటోలను కూడా తీసి ఇస్రోకి చేరవేసింది.
ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా..ఆ ఫోటోను క్లిక్ మనిపించింది. చంద్రయాన్-3 విజయవంతంగా ఆగస్టు 5వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆగస్టు 23వ తేదీన ల్యాండర్ చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి.
చంద్రుడి ఫోటోలో క్రాటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎడ్డింగ్టన్, అరిస్టార్‌చస్, పైతాగరస్, ఓసియన్ ప్రొసెల్లరమ్ లాంటి బిల్హాలు ఆ పిక్‌లో కనిపించాయి.
చంద్రుడి ఉత్తర ధృవంలో( North Pole) ఉన్న బిల్హాల్ లో…ప్రొసెల్లరమ్(Procellarum) చాలా పెద్దది. అది సుమారు 2500 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దాదాపు 4 లక్షల చదరపు కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.