Telugu News » Bill Blast  : ఆ ఊరు మొత్తాన్నీ…కరెంట్ బిల్లుతో బాదారు..!

Bill Blast  : ఆ ఊరు మొత్తాన్నీ…కరెంట్ బిల్లుతో బాదారు..!

వారికి రూ.200 లోపు వచ్చే బిల్లే ఎక్కువ అలాంటిది..ఏకంగా రూ.1600 బిల్లొచ్చింది.

by sai krishna

హమ్మయ్యా…ఈ నెల కరెంట్ బిల్లు( Power Bill) కట్టేశాం.! వచ్చేనెల దాకా  ఏ గొడవ లేదు.! అమ్మో నెలొస్తోంది కరెంటు బిల్లెలా కట్టాలో ఏంటో…!? దాదాపు అన్నీ ఇలాంటి జీవితాలే..కరెంటు బిల్లు కట్టడానికి అల్లాడే కుటుంబాలే..! మళ్లీ గుడ్డి దీపం వైపు వెళ్లలేక.   ఉపయోగించుకున్న సౌకర్యానికి బిల్లు కట్టే స్తోమత లేకున్నా కూలోనాలో చేసి కట్టేస్తారు. అప్పోసప్పో చేసి కట్టి హమ్మయ్యా అనుకుంటారు.

 

ఆ నెలకు.. ఎలెక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్(Electricity Department) వాళ్లు తమ ఫ్యూజ్ పీకెయ్యకుండా  గట్టెక్కుతారు.  వారికి రూ.200 లోపు వచ్చే బిల్లే ఎక్కువ అలాంటిది..ఏకంగా రూ.1600 బిల్లొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..! మనం ఊహించ లేకపోవచ్చు..! వాడుకున్న కరెంటుకు కొన్ని రెట్లు ఎక్కువ కరెంటు బిల్లు వస్తే అది వారికి ప్రకృతి వైపరీత్యంకన్నా పెద్ద కష్టమే.

 

ఈ సంఘటన సిద్దిపేట జిల్లా(Siddipet District) కోహెడ మండలం(Koheda Mandal)లో  బస్వాపూర్(Baswapur) లో చోటుచేసుకుంది. నెల రోజుల ఇంటి కరెంట్ బిల్లులు ఎక్కువ రావడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. రూ.1600 బిల్లు రావడమేంటని విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్​ను పిలిపించి నిలదీశారు.  దీంతో కాసేపు గ్రామస్థులకు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్​కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ విషయమై లైన్ ఇన్స్పెక్టర్​ను వివరణ కోరగా లోడ్ ఎక్కువ వాడుకున్నందుకు, జీఎస్టీ కలుపుకొని విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందని..అది డిపాజిట్ రూపంలో వినియోగదారుని బిల్లులోనే ఉంటుందని తెలిపారు.  కానీ గ్రామస్థులేమో..తమ ఊళ్లో పది కుటుంబాలకు పైగా రూ.1616 కరెంట్ బిల్లు వచ్చిందని అడిగితే., పొరపాటున వచ్చిందని లైన్ ఇన్స్పెక్టర్ మాట మార్చారు. పొరపాటున వచ్చినప్పుడు పేర్ల అంత కరెక్టుగా ఎలా వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులిచ్చిన ఈ షాక్ తో  లైన్ ఇన్స్పెక్టర్ దగ్గరు చెప్పడానికి సాకులు లేకుండా పోయాయి.

You may also like

Leave a Comment