కేసీఆర్ (KCR) వచ్చాక కరాబు అయ్యిందని కొంతమంది చెత్త నాయాళ్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy)అన్నారు. మేం వచ్చి మారుస్తామని అంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. వీళ్లు వచ్చాక చాలా మార్చారని.. కేసీఆర్ ఇచ్చిన 24 గంటల కరెంట్‌ను మాయం చేశారని అన్నారు.
కేసీఆర్ మాట్లాడితే ఊరకుక్కల్లా దాడి చేస్తామనే వెదవలకి ఏం అర్ధం కాదని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ తలపెట్టిన ఛలో నల్గొండ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన భాష మనం మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించారని అంటూనే.. కాంగ్రెస్ లీడర్లపై తీవ్ర పదజాలంతో దూషించారు.
కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇచ్చిన నీటిని మార్చి, 7 లక్షల ఎకరాలకు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేశారో చూడాలని ఉంటే కనబడతదని, వినాలని ఉంటే వినబడతది, మేం ఏం వినం, చూడం కేవలం అబద్దాలే మాట్లాడతామని, హక్కుల గురించి కేసీఆర్ మాట్లాడితే ఊరకుక్కల్లా దాడి చేస్తామనే వెదవలకి అర్ధం కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
కేసీఆర్ నల్గొండకు వచ్చి ఏం చేసిండు అని చెప్పే వెదవలకు నేను చెప్పే సమాధానం, 50 సంవత్సరాలు మీరు పెంచి పోషించి, 2 లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరైడ్ మహమ్మారిని 6 ఏళ్లలో తరిమికొట్టాడని అన్నారు. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 3 లక్షల వరి దాన్యం అందించే నల్గొండను 4 ఏళ్లలో 40 లక్షల టన్నులు వరి దాన్యం పండించే స్థితికి తీసుకువచ్చారని అన్నారు.
అసలు తెలంగాణ ఆత్మ ఉంటేనే కదా అర్ధం అయ్యేదని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే కదా అర్ధం అయ్యేదని అన్నారు. రెండు నెలలుగా నాగార్జున సాగర్ ఏపీ చేతికి వెళ్లిపోతే ఒక్కరు మాట్లాడలేదని, కేసీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి మాట్లాడితే అప్పుడు దాడి మొదలు పెట్టారని అన్నారు.
కేసీఆర్ సభ పెడుతున్నడు అంటే వనుకుడు మొదలైందని, అబద్దాలు చెప్పి చెప్పి ఏం పీకలేక అసెంబ్లీలో చర్చ పెట్టారని ఫైర్ అయ్యారు. వారికి హరీష్ రావు మోహం మీదనే అన్ని విషయాలు చెప్పారని అన్నారు. ఈ పదేళ్లలో ఏం జరిగింది, అనంతరం ఏం చేయ్యాలి అనే దాన్ని వివరించడానికి కేసీఆర్ సభ పెట్టారని అన్నారు.