Telugu News » Biomethane : మరో అద్భుత ప్రయోగంతో ఔరా అనిపించిన జపాన్‌ సైంటిస్టులు..!!

Biomethane : మరో అద్భుత ప్రయోగంతో ఔరా అనిపించిన జపాన్‌ సైంటిస్టులు..!!

ముఖ్యంగా దేశాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology)పాత్ర ఎంతో ఉందని ఒప్పుకోక తప్పదు.. కానీ టెక్నాలజీని సృష్టించేది కూడా మానవ మేధస్సు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మరోవైపు అంతరిక్షంలో నివాసం కోసం ఏర్పాట్లు చేసుకొంటున్న మానవుడు.. మరో అద్భుతమైన ప్రయోగంతో ఔరా అనిపించాడు..

by Venu

మానవ మేధస్సు (Human Intelligence) ఓ అద్భుతమని ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందుతోన్న టెక్నాలజీ (Technology) చూస్తే అర్థం అవుతోంది. బ్రతుకు దేరువు కోసం పోరాటం చేసిన నాటికాలం మనషుల నుంచి.. సౌకర్యంగా బ్రతకడం కోసం పోరాడుతోన్న నేటి మనుషుల ఆలోచనల్లో మార్పు ఒక్క రోజుతో జరిగింది కాదు.. దీని వెనక ఉన్న శ్రమ మాటల్లో చెప్పలేనిది. దాని ఫలితంగా నేడు.. అద్భుతమైన సృష్టిలో మానవుడు టెక్నాలజీ పేరుతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు..

ముఖ్యంగా దేశాభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ (Science and Technology)పాత్ర ఎంతో ఉందని ఒప్పుకోక తప్పదు.. కానీ టెక్నాలజీని సృష్టించేది కూడా మానవ మేధస్సు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. మరోవైపు అంతరిక్షంలో నివాసం కోసం ఏర్పాట్లు చేసుకొంటున్న మానవుడు.. మరో అద్భుతమైన ప్రయోగంతో ఔరా అనిపించాడు.. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్‌ బయోమీథేన్‌ (Biomethane)తో రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించారు.

ఈ ప్రయోగాన్ని జపాన్‌ సైంటిస్టులు (Japanese Scientists) విజయవంతం చేశారు.. దీనికి సంబంధించిన వరుస పరీక్షలు సక్సెస్‌ అయ్యాయని జపాన్‌ స్పేస్‌ స్టార్టప్‌ ‘ఇంటర్‌స్టెల్లార్‌ టెక్నాలజీస్‌’(IST) గురువారం ప్రకటించింది. హోకైడోలోని ‘హోకైడో స్పేస్‌పోర్ట్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌’లో సైంటిస్టులు ఈ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. సాంప్రదాయ రాకెట్‌ ఇంజిన్లతో పోల్చితే లిక్విడ్‌ బయోమీథేన్‌ ఆధారిత రాకెట్‌ ఇంజిన్ల ఖర్చు చాలా తక్కువని ఐఎస్‌టీ తెలిపింది..

You may also like

Leave a Comment