దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కూడా చాలా చోట్ల వెరైటీ గణపతు (Lord Ganesh) లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీ కాళహస్తి (Sri Kalahasthi)లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అందరిని ఆకట్టుకుంటోంది. అక్కడ యువత ఏర్పాటు చేసిన చంద్రయాన్ (Chandrayan) వ్యోమగామి గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు అక్కడకు వస్తున్నారు.
ఇస్రో సాధించిన విజయాలను ప్రజలకు, విద్యార్థులకు ఆ యూత్ అవగాహన కలిగిస్తోంది. చంద్ర మండలంపైకి వినాయకున్ని పంపించినట్టుగా వుండేలా సెట్ ఏర్పాటు చేశారు. అక్కడే సౌర మండల గ్రహాలను కూడా ప్రదర్శించారు. చంద్రయాన్ 3, ఆదిత్య య ఎల్-1 ఉపగ్రహ ప్రయోగాలు, ఇస్రో కీర్తిని విద్యార్థులకు అర్థం అయ్యేలా వివరించడమే తమ లక్ష్యమన్నారు.
సాంకేతికత, ఆధ్యాత్మికత మేళవింపుతో ఏర్పాటు చేసిన గణపయ్య మండపాన్ని చూసి అంతా ముగ్దులవుతున్నారు. ఈ ఆలోచన చేసిన యూత్ సభ్యులను భక్తులు అభినందిస్తున్నారు. ఇస్రో కీర్తి గురించి, చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 వంటి ప్రయోగాల గురించి విద్యార్థులకు వివరించేందుకు ఆ సభ్యులు చేస్తున్న కృషిని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.
మరోవైపు ఆదిత్య ఎల్-1కు సంబంధించి ఇస్రో కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆదిత్య ఎల్-1 శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలు పెట్టినట్టు ఇస్రో పేర్కొంది. మిషన్ లో ఏర్పాటు చేసిన స్టెప్స్ పరికరంలోని సెన్సార్స్ పని చేయడం మొదలు పెట్టాయని తెలిపింది. ఈ రోజు అర్ధరాత్రి వరకు మిషన్ కీలక దశకు చేరుకుంటుందని చెప్పింది.