ఇంటి నుంచి బయటకు వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వస్తాడని నమ్మే రోజులు పోయాయి. ఏ క్షణం ఈ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయంతో బ్రతికే రోజులను ఇప్పుడు మనం చూస్తున్నాం. మరణం మనిషి వెనకాలే నీడల ఉంటున్న ఈ రోజుల్లో మృత్యువు ఎలా పంజా విసురుతుందో తెలియదు.. అందుకు ఉదాహరణ నేడు సమాజంలో సంభవిస్తున్న మరణాలు..
ఇక రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా మృత్యువు పలకరిస్తుంది. మరోవైపు రహదారుల రక్త దాహం ఇంకా చల్లారనట్టు ఉంది. 12 మంది ప్రాణాలను బలి తీసుకోంది. ఆ వివరాలు చూస్తే.. కర్ణాటక (Karnataka)లోని చిక్కబళ్లాపుర్ (Chikkaballapur)లో ఘోర ప్రమాదం (Accident)చోటు చేసుకోంది. ఆగి ఉన్న సిమెంట్ లారీని టాటా సుమో ఢీకొట్టగా.. 12 మంది అక్కడికక్కడే మరణించారు.
జాతీయ రహదారి నెం.44పై గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకొంది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షత్రగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్టు.. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనం పై ఏపీకి చెందిన నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు మృతులంతా ఏపీకి చెందిన వారుగా అనుమానిస్తున్నారు..