Telugu News » Siddaramaiah : అప్పులు చేసి పెళ్లిళ్లు చేసుకోవద్దు: సీఎం

Siddaramaiah : అప్పులు చేసి పెళ్లిళ్లు చేసుకోవద్దు: సీఎం

by Prasanna
Karnataka cm

ఆడంబరంగా పెళ్లిళ్లు (Marriages) చేసుకోవడానికి రుణాలు తీసుకోవడం మానుకోవాలని కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పేద, మధ్యతరగతి వర్గాల వారు గొప్పలకు పోయి.. అప్పులు చేసి ఆడంబరంగా వివాహ వేడుకలు చేసుకోవడం ఆపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. సమాజంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని అన్నారు.

Karnataka cm

మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని శ్రీ మలై మహదేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి వర్గాల వారు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో పడకూడదనీ, ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం వారి పెను భారంగా మారుతోందని అన్నారు. కొందరు వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా పెళ్లుళ్లు చేస్తున్నారని అన్నారు.

ఆ అప్పులు తీర్చాలంటే.. జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని అభిప్రాయ పడ్డారు. అందుకే సాదాసీదాగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు. ఘనంగా పెళ్లిళ్ల కోసం స్థోమతకు మించి అప్పులు చేయడం వలన అప్పుల్లో కురుకుపోయి, మళ్లీ కోలుకోలేకపోతున్నారని అన్నారు.  ఉన్నంతలో పెళ్లిళ్లు చేసుకుని హాయిగా జీవించాలని సూచించారు.

ఈ సందర్భంగా మహదేశ్వర ఆలయం గురించి మాట్లాడుతూ.. ఈ ఆలయం ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ప్రదేశమని అన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మలై మహదేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. గతంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న శక్తి యోజన ఫలితంగా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మలై మాదేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారని ఆయన అభినందించారు.

You may also like

Leave a Comment