కర్ణాటకలో(Karnataka) దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ పాఠశాలలో గణేష్ (Ganesh Idol)విగ్రహానికి పూజలు చేసినందుకు విద్యార్థిని (Student)చేతిని టీచర్(Teacher) విరగ్గొట్టింది. దీంతో కోలార్ విద్యాశాఖ ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసింది.
బుధవారం నాడు సెప్టెంబర్ 20, కోలార్ జిల్లా, కేజీఎఫ్ తాలూకాలోని అల్లికల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలతను కోలార్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తి ఆదేశం మేరకు సస్పెండ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థిని వైద్య ఖర్చులు కూడా చూసుకోవాలని హేమలతను ఆదేశించారు.
గత వారం పాఠశాలలో గణేష్ విగ్రహానికి పూజ చేసినందుకు ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థిని భవ్యను కొట్టింది. భవ్యకు విధించిన శిక్ష ఎంత తీవ్రంగా ఉంది అంటే శిక్షకు విద్యార్థిని ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది.
బాలిక తల్లిదండ్రులు కేజీఎఫ్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థినిని బీఈవో మునివెంకటరామాచారి పరామర్శించి, సస్పెండ్ అయిన ప్రధానోపాధ్యాయుడిపై నివేదిక సమర్పించారు.