బీఆర్ఎస్ చేపట్టిన ‘ఛలో నల్లగొండ’లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్గొండ సభలో పాల్గొనేందుకు మాజీ సీఎం కేసీఆర్ పట్టణంలో ని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి వచారు. హరీశ్ రావు అలాగే మాజీ మంత్రులకు. ఇతర ప్రజాప్రతినిధులకు భోజనం ఏర్పాటు చేశారు.
అనంతరం సభా స్థలికి బస్సులో వెళ్తున్న సమయంలో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బస్సును అడ్డుకునే యత్నం చేశారు. హోటల్ మనోరమ ముందు శ్రీ లక్ష్మీ కాలనీ వద్దకు రాగా ఎన్ఎస్ యూఐ నాయకులు ఒక్కసారిగా బస్సుకు అడ్డంగా దూసుకు వచ్చారు.
కేసీఆర్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నల్లటి దుస్తులు ధరించి నిరసన తెలిపారు. కోడిగుడ్లతో బస్సుపై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. అంతకు ముందు క్లాక్ టవర్ సెంటర్‌లో కుర్చీ వేసి దానిపై కేసీఆర్ ఫోటో పెట్టి ఎల్ఈడీ స్క్రీన్ వేశారు.
గత పదేండ్లలో నల్లగొండకు జరిగిన అన్యాయాలపై ప్రసారం చేశారు. అలాగే కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్గొండ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే బీఆర్ఎస్ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు.