మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkata reddY) మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శుక్రవారం మీడియాతో చిట్‌చాట్ (Media chit chat)నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఎవరికి టికెట్ కేటాయిస్తే వారి గెలుపుకోసం పనిచేస్తానని అన్నారు. ఒక్క తెలంగాణ విషయంలో తప్పా.. ఎన్నడూ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేదన్నారు. టికెట్ల కేటాయింపు విషయంలో తాను కలుగజేసుకోవడం లేదన్నారు.
ప్రస్తుతం తన నియోజకవర్గం, తన శాఖ గురించి తప్ప వేరేది పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇక కేసీఆర్(KCR) గురించి ప్రస్తావించిన మంత్రి.. ఆయన చేసిన పాపాలే ఇప్పుడు చుట్టుముట్టాయని సంచలన కామెంట్స్ చేశారు. యాదగిరి గుట్టపేరును మార్చడమే ఆయన చేసిన మొదటి తప్పు. కేసీఆర్ చేసిన పాపాల వల్లే కరువు వచ్చింది. వర్షం అంటే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటే వర్షం అన్నట్లు ఉండేది. దేవుడి పేరు పేట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారు.
నల్లగొండ జిల్లాను నాశనం చేసి ఏ మొకం పెట్టుకోని కేసీఆర్ జిల్లాకు వచ్చి ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారులతో చాలా పాపపు పనులు చేయించారు. దీంతో ఇప్పుడు వారు సరిగా నిద్రపోవడం లేదు. కరువు వలన ఎండిన పంటలను చూస్తుంటే ఏడుపు వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఇండ్లు ఇచ్చాం. కేసీఆర్ ఎవరికి ఇండ్లు ఇచ్చారో ఎవ్వరికీ తెలియదు.
దళితబంధు, సీఎంఆర్ఎఫ్‌పై కమీషన్లు తీసుకున్నారు.యాదగిరి గుట్టలో పెద్ద స్కాం జరిగింది. ఎన్నికల తరువాత విచారణ జరిపిస్తాం.యాదాద్రి పేరును మళ్ళీ యాదగిరి గుట్టగా మారుస్తాం. ఎన్నికల కోడ్ పూర్తయ్యాక జీవో తీసుకొస్తామన్నారు. ఊళ్లల్లో ఇండ్లను కూల్చి తన ఫామ్‌హౌస్ కోసం కేసీఆర్ రోడ్డు వేసుకున్నారు. కేవలం రూ.200 కోట్లు ఖర్చు చేస్తే ఆలేరు పూర్తయ్యేది.
ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రాష్ట్రంలో చూడలేదు. కేసీఆర్ పక్తూ రాజకీయ నాయకుడయ్యారు.ప్రతీది రాజకీయం చేశారు.కాంగ్రెస్ పార్టీలో కొత్తవాళ్లే టికెట్లు ఇస్తున్నామని అంటున్నారు. గెలిచేవాళ్లకే టికెట్లు ఇస్తున్నాం. పాతవాళ్లకు మేమున్నాం.హైదరాబాద్‌లో పార్టీ వీక్ గా ఉన్నదగ్గర గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.