కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాంగాంగ్ పర్యటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టైలిష్ లుక్ లో అందమైన రోడ్లపై బైక్ నడుపుతున్న ఆయన ఫోటోలను వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే.. బీజేపీ శ్రేణులు కూడా ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రాహుల్ జాయ్ గా బైక్ నడుపుతున్న రోడ్లను చూపిస్తూ.. గత కాంగ్రెస్ పాలనలో ఎలా ఉండేదో వివరిస్తున్నారు.
కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్ పాలనలో అధ్వాన్నమైన రోడ్లను మోడీ సర్కారు (Modi Govt) అద్భుతమైనవిగా మార్చారని అన్నారు. ఇప్పుడు ఆ రహదారులపై రాహుల్ గాంధీ బైక్ రైడ్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. బీజేపీ (BJP) సర్కార్ వేసిన అద్భుతమైన రోడ్లను ప్రోత్సహించినందుకు రాహుల్ గాంధీకి థ్యాంక్స్ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ (Congress) పాలనలో రోడ్ల పరిస్థితిని, ఇప్పుడు లద్దాఖ్ లోని రహదారులను చూపించే వీడియోలను కూడా జతచేశారు.
బీజేపీ శ్రేణులు ఈ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ కు చురకలంటిస్తున్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తున్నారు. తన తండ్రి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ లద్దాఖ్ కు బైక్ పై వెళ్లారు. ఆదివారం ఉదయం పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ పర్యటనను రెండు రోజుల్లో ముగించాలని అనుకున్నా.. తర్వాత ఆరు రోజులకు పొడిగించుకున్నారు.
తన పర్యటనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు రాహుల్ గాంధీ. ఈక్రమంలోనే బైక్ నడుపుతున్న ఫోటోలు వైరల్ కాగా.. తాము వేసిన రోడ్లను ప్రమోట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నారు బీజేపీ నేతలు.
Thanks to Rahul Gandhi for promoting excellent roads of Ladakh built by the @narendramodi govt. Earlier, he also showcased how Tourism is booming in Kashmir Valley & reminded all that our "National Flag" can be peacefully hoisted at Lal Chowk in Srinagar now! pic.twitter.com/vta6HEUnXM
— Kiren Rijiju (@KirenRijiju) August 19, 2023