చర్లపల్లి టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. మొత్తం మూడు దశల్లో పనులు జరుగుతాయని తెలిపారు. త్వరలోనే టెర్మినల్ పనులు పూర్తి అవుతాయని చెప్పారు. టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ (PM Modi)ని ఆహ్వానిస్తామని వెల్లడించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రూ. 715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్దికి కేంద్రం ప్రభుత్వం కృష్టి చేస్తుందని అన్నారు. గతేడాది ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారని తెలిపారు.
టెర్మినల్ మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. ప్లాట్ ఫామ్ 1లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. అత్యంత వేగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తున్నారని తెలిపారు. విమానాశ్రయం తరహాలో కొత్త స్టేషన్ రూపుదిద్దుకుంటోందన్నారు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే ఆ ప్రాంతాల దగ్గర కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ 22 లిఫ్టులు 30 కి పైగా ఎస్కలేటర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.