Telugu News » Kishan Reddy: మళ్లీ గెలిస్తే.. తిరోగమనమే!

Kishan Reddy: మళ్లీ గెలిస్తే.. తిరోగమనమే!

కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలు ఖాయం.

by admin
Kishan Reddy Strong Counter To kcr

కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి

తెలంగాణలో కుటుంబ పరిపాలన జరుగుతోంది. బీఆర్​ఎస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆపార్టీ నేతలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారు. మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దే. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం కీలకపాత్ర పోషిస్తోంది. కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మరింది. ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు.

కేసీఆర్ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తే తెలంగాణ అధోగతి పాలు ఖాయం. ఇదేమీ నిజాం రాజ్యాంగం కాదు. నేను నా కుటుంబం అంటే కుదరదు. కుటుంబ పార్టీలకు పాతర వేసే రోజు ఎంతో దూరం లేదు. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలు అవినీతితో దేశాన్ని దోపిడీ చేస్తున్నాయి. కుటుంబ పార్టీలు ఎక్కడ ఉన్నాయో.. అక్కడ అవినీతి ప్రభుత్వాలు ఉన్నాయి. కాంగ్రెస్​, ఎంఐఎం, బీఆర్​ఎస్​ ఈ మూడు పార్టీలు కూడా ఒకే రకమైన డీఎన్​ఏతో ఉన్న పార్టీలు.

ఈ మూడు పార్టీలు బుజ్జగింపు, స్వార్థ రాజకీయాలు చేసే పార్టీలు. ఈ మూడు పార్టీలు ఒకే తాను మొక్కలు. బీఆర్‌ఎస్‌ పార్టీ కేరాఫ్ అడ్రస్ సోనియా గాంధీ ఆఫీస్. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌ కి వేసినట్టే. బీఆర్ఎస్‌ కి వేసినా ఎంఐఎంకి వేసినట్టే. బీఆర్ఎస్‌ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. కేసీఆర్ కు ఇంకోసారి అధికారం వస్తే.. తెలంగాణ అన్ని రంగాల్లో తిరోగమన దిశలో వెళ్తుంది.

బీఆర్​ఎస్​ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. అనేక సర్వేల ద్వారా వాళ్లకు ఈ విషయం అర్థమైంది. అందుకే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను మాట్లాడకుండా అసెంబ్లీలో గొంతు నొక్కేస్తున్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు ఏ రకంగా నిధులు ఇచ్చామో చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టుల్లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంది. కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదు.

You may also like

Leave a Comment