Telugu News » Kodanda Reddy : కేటీఆరే మొదటి నేరస్థుడు!

Kodanda Reddy : కేటీఆరే మొదటి నేరస్థుడు!

బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లో తిరగనివ్వం. ఒక్కో గ్రామంలో దళితుల దగ్గర భూమిని 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారు.

by admin
kodanda Reddy fire on kcr govt

కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు

ఇందిరా గాంధీ (Indira Gandhi) హయాంలో భూ సంస్కరణల ద్వారా ఇచ్చిన భూములను కేసీఆర్ (KCR) ప్రభుత్వం చట్ట విరుద్ధంగా బిల్డర్స్ కి అప్పగిస్తోంది. బుద్వేల్ లో 282 ఎకరాలు దళితులకు మా హయాంలో పంచాం. 1995లో టీడీపీ (TDP) హయాంలో అసైన్ భూమి అని ఆర్డీవో నోటీసులు ఇచ్చారు. హైకోర్టు (High Court) దళితులకు ఇచ్చిన భూములు లాక్కోవడానికి లేదని 2008లో తీర్పునిచ్చింది.

kodanda Reddy fire on kcr govt

ఆ భూములు ఇప్పటి వరకు దళితుల చేతిలోనే ఉన్నాయి. హెచ్ఎండీఏ (HMDA) వంద ఎకరాల వరకు ఈ-వేలం వేసింది. 24 లక్షల ఎకరాల అసైర్డ్ భూములు ఉంటే 10 వేల ఎకరాలు బిల్డర్స్ కు అప్పగించారు. భూముల రికార్డుల ప్రక్షాళన పేరుతో అక్రమాలు జరిగాయి. ఇందులో మొదటి నేరస్థుడు మున్సిపల్ మంత్రి కేటీఆర్ (KTR). ధరణి లోపాల విషయంలో ప్రభుత్నాన్ని వదిలేది లేదు. న్యాయపోరాటం చేస్తాం.

బీఆర్ఎస్ (BRS) నేతలను గ్రామాల్లో తిరగనివ్వం. ఒక్కో గ్రామంలో దళితుల దగ్గర భూమిని 9 లక్షలకు కొని 99 లక్షలకు అమ్ముకున్నారు. ఇందిరా గాంధీ పంచిన భూములు పేదలకు అందేలా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. ఈ భూముల అమ్మకం చెల్లదు. యూపీఏ ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ చట్టం తేవడానికి, సర్వేలు చేయడానికి డబ్బులు కూడా కేటాయించింది.

నేను హుడా చైర్మన్ గా ఉన్నప్పుడు 5 అంతస్తుల పైన కట్టొద్దని నిర్ణయం తీసుకున్నాం. 100 కోట్లకు ఎకరాన్ని అమ్మిన భూమిలో ఎస్ఎఫ్ఐ లిమిట్ లేదు. ఎన్ని అంతస్తులు అయినా కట్టుకోవచ్చు. ఫ్లైట్ పోయే మార్గంలో ఇలాంటి నిర్మాణలు ఉండొద్దు అని చెబుతున్నారు. పేదల భూములు గుంజుకున్న అంశంలో మా పోరాటం ఆగదు.

You may also like

Leave a Comment