తపపై బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ( Konda Vishweshwar Reddy) పెట్టిన కేసుపై బీఆర్ఎస్ ఎంపీ (BRS MP) రంజిత్ రెడ్డి (Ranjith Reddy) స్పందించారు. అదో అనవసరమైన కేసు అని వ్యాఖ్యానించారు. ప్రతి దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే తాపత్రయ పడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
అసలు కేసు ఎందుకు పెట్టారనే విషయం కొండా విశ్వేశ్వర్ రెడ్దికే తెలియాలని అన్నారు. ఆ కేసు పై తానేమీ మాట్లాడనని స్పష్టం చేశారు. తన 60 ఏండ్ల జీవితంలో తనపై ఎలాంటి ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదని వెల్లడించారు. కొంత మంది ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించనున్నారని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. విభజన సమస్యలను లేవనెత్తుతామని వెల్లడించారు.
అంతకు ముందు ఈ నెల 20న ఎంపీ రంజిత్ రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేశారని, తనను దూషిస్తూ బెదిరింపులకు దిగారని చెప్పారు. అయితే బెదిరించింది ఎవరనే విషయాన్ని మీడియా ముందు ప్రస్తావించని విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రంజిత్ రెడ్డి పేరు చెప్పారు.